Bigg Boss Telugu | బిగ్ బాస్-8లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న కమెడియన్.. ఇక మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా అనాల్సిందే..!
Bigg Boss Telugu | ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ త్వరలో ప్రారంభం కానున్నది. ఇప్పటికే షోకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ నెలాఖరు లేదంటే సెప్టెంబర్ మొదటివారంలో షో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Bigg Boss Telugu | ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ త్వరలో ప్రారంభం కానున్నది. ఇప్పటికే షోకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ నెలాఖరు లేదంటే సెప్టెంబర్ మొదటివారంలో షో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. దాదాపు 106 రోజుల అభిమానులకు షో ఎంటర్‌టైన్‌మెంట్ అందివ్వనున్నది. ముఖ్యంగా హౌస్‌లో జరిగే చర్చలు, గేమ్స్‌తో పాటు సోమవారం జరిగే నామినేషన్స్ రసవత్తరంగా ఉంటాయి. ఇక ఈ సారి కూడా హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించబోతున్నారు. ఈ సారి కంటెస్టెంట్స్ విషయంలో మేకర్స్ భారీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్. గత సీజన్లకు భిన్నంగా.. 8వ సీజన్‌కు భారీ సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తున్నది. కంటెస్టెంట్ సెలక్షన్ దగ్గర నుంచి హౌస్‌లో జరిగే టాస్క్‌లను వరకు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా ఉంటుందని తెలుస్తున్నది. మరో వైపు ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్ గురించి వార్తలు వస్తున్నాయి. ఇందులో వెళ్లేది ఎవరనేది క్లారిటీ లేదు.
బీబీహౌస్‌లోకి వెళ్లే వారిలో ప్రముఖ హాస్య నటుడు అభినవ్ గోమఠం పేరు సైతం వినపిస్తున్నది. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో అభినవ్ ఒకడు. కామెడీతో పాటు సెటైరికల్ డైలాగ్స్ వేయడంలో ఆయనకు ఆయనే సాటి. సోషల్ మీడియా మీమర్స్‌కు అభినవ్ ఓ ఆణిముత్యంలాంటివాడు. ప్రస్తుతం గోమఠం డైలాగ్స్‌తో రూపొందించిన మీమ్స్ తెగ వైరల్ అవుతుంటాయి. అభినవ్ గోమఠం ‘సేవ్ ది టైగర్స్’ డిస్నీ హాట్‌స్టార్ సిరీస్‌తో మంచి ఫేమ్‌ని సాధించాడు. ‘మస్తు షేడ్స్ ఉన్నాయి రా’ మూవీలో హీరోగా నటించాడు. అలాగే, పలు సినిమాల్లోనూ కమెడియన్‌గా రాణించాడు. తాజాగా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలియడంలో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇక ఈ సారి బీబీ హౌస్‌లోకి సొసైటీలో మంచి గుర్తింపు ఉన్న వారిని ఎంపిక చేస్తున్నట్లుగా టాక్. టీవీ సీరియల్ నటీ నటులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కమెడియన్స్, న్యూస్ రీడర్స్, సినిమా, టీవీ యాక్టర్స్‌ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.