Bigg Boss Telugu | బిగ్‌ బాస్‌ తెలుగు హోస్ట్‌ ఇక ఆ హీరోనే ఫిక్స్‌ అట..! మరీ ఆయనెవరో తెలుసా..?

Bigg Boss Telugu | తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌. ప్రతిసారీ కొత్త సీజన్‌ ప్రారంభమయ్యే ముందు కంటెస్టెంట్స్‌గా ఎవరు బీబీహౌస్‌లోకి అడుగుపెడతారోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే, హోస్ట్‌ ఎవరు? అనే విషయంలోనూ కొంత ఆసక్తి ఉంటుంది. గతంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు న్యాచురల్‌ స్టార్‌ నాని సైతం హోస్ట్‌గా వ్యవహరించారు.

Bigg Boss Telugu | బిగ్‌ బాస్‌ తెలుగు హోస్ట్‌ ఇక ఆ హీరోనే ఫిక్స్‌ అట..! మరీ ఆయనెవరో తెలుసా..?

Bigg Boss Telugu | తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌. ప్రతిసారీ కొత్త సీజన్‌ ప్రారంభమయ్యే ముందు కంటెస్టెంట్స్‌గా ఎవరు బీబీహౌస్‌లోకి అడుగుపెడతారోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే, హోస్ట్‌ ఎవరు? అనే విషయంలోనూ కొంత ఆసక్తి ఉంటుంది. గతంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు న్యాచురల్‌ స్టార్‌ నాని సైతం హోస్ట్‌గా వ్యవహరించారు. ఎన్టీఆర్‌ తొలి సీజన్‌, నాని రెండోసీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. మూడో సీజన్‌ నుంచి టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఏడు సీజన్స్‌తో పాటు ఓటీటీ సీజన్‌కు సైతం నాగ్‌ హోస్ట్‌గా చేస్తూ వచ్చారు.

త్వరలోనే బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ కోసం మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే, ఈ సారి హోస్ట్‌ మారనున్నారని ప్రచారం జరిగింది. అయితే, ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తున్నది. బిగ్‌బాస్‌ షోకు ఉన్న ఒకే ఒక ఆప్షన్‌ నాగార్జున మాత్రమే. ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్స్‌ అంతా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. నాగ్‌ మాత్రమే సినిమాలతో పాటు బిగ్‌బాస్‌ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ వచ్చారు. బిగ్‌బాస్ అనగానే అందరికీ నాగార్జున హోస్ట్ అనేది ఆడియన్స్‌ సైతం ఫిక్స్‌ అయ్యారు. హోస్ట్‌గా నాగార్జున రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే హోస్ట్‌గా ఆయన్నే కొనసాగించడం బెటర్‌ అనే నిర్వాహకులు భావిస్తున్నారని
తెలుస్తున్నది.

హిందీలో బిగ్‌బాస్ హోస్ట్‌గా కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. తెలుగులోనూ నాగ్‌నే పర్మినెంట్ చేసే ఛాన్స్‌ ఉన్నది. దీంతో ఇక హోస్ట్‌ ఎవరు అనే విషయంలో చర్చలకు ముగింపు పలుకుతారా? లేదా చూడాల్సిందే. ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్ బ‌జ్ పేరుతో స్టార్ మా ఓ టాక్‌షోను టెలికాస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సీజన్‌ వారీగా పాపులర్‌ అయిన అయిన మాజీ కంటెస్టెంట్స్‌లో ఒకరు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గ‌త సీజ‌న్‌లో గీతూ రాయ‌ల్ బిగ్‌బాస్ బ‌జ్ షోకు హోస్ట్‌గా చేసింది. ఎనిమిదో సీజన్‌ బిగ్‌బాస్‌ బస్‌ టాక్‌షో హోస్ట్‌గా శివాజీని ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తున్నది.