Bigg Boss7: బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచే రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ కార్యక్రమం తెలుగులో ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఆరో సీజన్ తప్ప మిగతా సీజన్స్ అన్ని కూడా ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాయి. ఆరో సీజన్లో కంటెస్టెంట్స్ ముఖాలు తెలియకపోవడం, అనూహ్యమైన ఎలిమినేషన్‌తో పాటు నాగ్ హోస్టింగ్ కూడా కొంత రేటింగ్ తగ్గడానికి కారణమైంది. ఇప్పుడు సీజన్ 7లో ఆ లోపాలన్ని సరి చేసి దాదాపు 25 మంది కంటెస్టెంట్స్ […]
Bigg Boss7: బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచే రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ కార్యక్రమం తెలుగులో ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఆరో సీజన్ తప్ప మిగతా సీజన్స్ అన్ని కూడా ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాయి. ఆరో సీజన్లో కంటెస్టెంట్స్ ముఖాలు తెలియకపోవడం, అనూహ్యమైన ఎలిమినేషన్‌తో పాటు నాగ్ హోస్టింగ్ కూడా కొంత రేటింగ్ తగ్గడానికి కారణమైంది. ఇప్పుడు సీజన్ 7లో ఆ లోపాలన్ని సరి చేసి దాదాపు 25 మంది కంటెస్టెంట్స్ తో షోని అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి హోస్ట్ నాగార్జుననే సీజన్ 7కి కూడా హోస్ట్‌గా ఉంటారని టాక్ నడుస్తుండగా, దీనిపై పూర్తి క్లారిటీ లేదు. మరో వైపు ఈ షోకి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ ఓ వార్త షికారు చేస్తుంది.
ఆగస్టు మొదటి వారంలో బిగ్ బాస్ 7 గ్రాండ్ గా లాంచ్ కానుండగా, ఈ సారి బోల్డ్ యాంకర్ విష్ణుప్రియ హౌజ్‌లో అడుగుపెట్టనున్నట్టు సమాచారం. ఇక ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న సీరియల్ నటులు అమర్ దీప్, తేజస్విని.. కపుల్స్ విభాగంలో హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక విడాకులు తీసుకున్న ఓ జంట కూడా హౌజ్‌లోకి వస్తుందనే ప్రచారం నడుస్తుంది. వారు నోయల్, ఎస్తేరు అని అంటున్నారు. ఇప్పటికే ఓ సీజన్లో నోయల్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. అనారోగ్యంతో బయటకు వచ్చేశాడు. ఇప్పుడు తిరిగి హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
ఇక జబర్దస్త్ మాజీ కమెడియన్ అప్పారావుని కూడా హౌజ్‌లోకి ప్రవేశ పెట్టనున్నారట.. కార్తీక దీపం సీరియల్ విలన్ శోభా శెట్టి , సింగర్ మోహన భోగరాజు, ఢీ పండు, యూట్యూబర్ నిఖిల్, మహేష్ బాబు కాళిదాసు, సాయి రోనాక్, సిద్ధార్థ్ వర్మ, బ్యాంకాక్ పిల్ల, రష్మీ గౌతమ్ ఇలా 25 మంది బిగ్ బాస్ సీజన్ 7 లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు. మరి లీకైన లిస్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు కాని ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.