Bigg Boss8| బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరేన‌ట‌.. తెర‌పైకి కొత్త లిస్ట్‌

Bigg Boss8| బుల్లితెర ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం త్వ‌ర‌లో సీజ‌న్ 8 జ‌రుపుకోనుంది. గ‌త కొద్ది రోజులుగా షోకి సంబంధించి నెట్టింట అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావొచ్చ‌నే టాక్ విని

  • By: sn    cinema    Aug 11, 2024 8:10 PM IST
Bigg Boss8| బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరేన‌ట‌.. తెర‌పైకి కొత్త లిస్ట్‌

Bigg Boss8| బుల్లితెర ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం త్వ‌ర‌లో సీజ‌న్ 8 జ‌రుపుకోనుంది. గ‌త కొద్ది రోజులుగా షోకి సంబంధించి నెట్టింట అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావొచ్చ‌నే టాక్ వినిపిస్తుంది. ఇప్ప‌టికే అన్న‌పూర్ణ స్టూడియోలో సెట్ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని, కంటెస్టెంట్స్ ప్ర‌క్రియ కూడా పూర్తైంద‌నే టాక్ వినిపిస్తుంది. గ‌తంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి సంబంధించిన లిస్ట్ ఒక‌టి బ‌య‌ట‌కు రాగా, ఇప్పుడు ఆ లిస్ట్ తారుమారైంద‌ని అంటున్నారు.

గతంలో జబర్దస్త్ కామెడీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మ‌హిధ‌ర్ అనే వ్య‌క్తి ప్ర‌స్తుతం బిగ్ బాస్ రివ్యూలు, సినిమా రివ్యూలు ఇస్తూ ఫేమస్ యూట్యూబర్ గా గుర్తింపు పొందాడు. ఇతని రివ్యూలని చాలా మంది విశ్వ‌సిస్తుంటారు.ఈ క్ర‌మంలోనే అత‌ను బాస్ ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్ ను రిలీజ్ చేశాడు . అందులో బుల్లితెర నుంచి బర్దస్త్ నరేశ్, యాదమ్మ రాజు, కిరాక్ ఆర్పీ, బంచిక్ బబ్లూ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. సీరియల్ కేటగిరీ నుంచి రీతూ చౌదరి, ప్రేరణ కంభం, ఏక్ నాథ్- హారిక జంట, హీరోయిన్స్ కేటగిరీ నుంచి సోనియా సింగ్, కుషితా కల్లపు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల కేటగిరీ నుంచి మహాసేన రాజేశ్, యువ సామ్రాట్, హీరో ఆదిత్య ఓం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు మహిధర్. అయితే ఈసారి కంటెస్టెంట్స్ లిస్టు పెరిగింద‌ని త్వరలోనే మరిన్ని విషయాలతో మీ ముందుకు వ‌స్తాన‌ని కూడా అత‌ను చెప్పాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్ బాస్ సీజ‌న్ 8కి సంబంధించి ఆఫీసియల్ గా కంటిస్టెంట్స్ లిస్ట్ రాకున్నా.. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కొందరూ మాత్రం.. ఈ కంటిస్టెంట్స్ పక్కగా షోలో ఉన్నారంటూ బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. వారికి ఆఫిషియల్ గా మెయిల్స్ కూడా వచ్చాయంటూ జనాల్లో ఉన్న క్యూరియాసిటీని పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ మ‌ధ్య కొంద‌రు రివ్యూయ‌ర్స్.. నటి సన, మై విలేజ్ షో అనిల్, యాదమరాజు, బర్రెలక్క (సిరి), యాంకర్ వింధ్య, కిర్రాక్ ఆర్పీ, గాయత్రి గుప్తా, కుమారి ఆంటీ, ఆర్గానిక్ ఫార్మింగ్ నేత్ర, సీరియల్ నటుడు ఇంద్రనీల్, హీరో అబ్బాస్, రోహిత్, సింగర్ సాకేత్, ఊర్మిళ చౌహాన్ వంటి వారు హౌజ్‌లో అడుగుపెడతారంటూ చెప్పుకొచ్చారు.