Bollywood| టాలీవుడ్ స్టార్ హీరోల‌పై బాలీవుడ్ కెమెరామెన్ అక్క‌సు.. ఎందుకింత ఏడుపు..!

Bollywood|  టాలీవుడ్ సినిమా ఇప్పుడు ఎల్ల‌లు దాటింది. మ‌న సినిమాల‌కి విదేశాల‌కి చెందిన ప్ర‌ముఖులు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా అంటూ సౌత్ సినిమా అన్న ముద్ర ప‌డింది. బాలీవుడ్ స్టార్స్ మంచి హిట్ అందుకునేందుకు సౌత్ స్టార్స్‌ని త‌మ సినిమాల‌లో ముఖ్య పాత్ర‌ల‌కి

  • By: sn    cinema    Jun 09, 2024 7:41 AM IST
Bollywood| టాలీవుడ్ స్టార్ హీరోల‌పై బాలీవుడ్ కెమెరామెన్ అక్క‌సు.. ఎందుకింత ఏడుపు..!

Bollywood|  టాలీవుడ్ సినిమా ఇప్పుడు ఎల్ల‌లు దాటింది. మ‌న సినిమాల‌కి విదేశాల‌కి చెందిన ప్ర‌ముఖులు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా అంటూ సౌత్ సినిమా అన్న ముద్ర ప‌డింది. బాలీవుడ్ స్టార్స్ మంచి హిట్ అందుకునేందుకు సౌత్ స్టార్స్‌ని త‌మ సినిమాల‌లో ముఖ్య పాత్ర‌ల‌కి ఒప్పిస్తున్నారు. రోజురోజుకి సౌత్ సినిమా క్రేజ్ పెరిగిపోతూ ఉండ‌డంతో బాలీవుడ్ వాళ్లు సౌత్ హీరోల‌పై అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కొంద‌రు నోటి దురుసుతో ఇష్ట‌మొచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు హీరోలు ఎంతో సింపుల్ గా ఉంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే అదంతా డ్రామా అని.. సౌత్ హీరోలకు యాటిట్యూడ్ ఎక్కువ అంటూ బాలీవుడ్ కెమెరామెన్ వీరేందర్ చావ్లా కామెంట్ చేశాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా ఫంక్ష‌న్‌కి చెప్పులు వేసుకొని వెళ్ల‌డాన్ని ఆయ‌న విమ‌ర్శించాడు. సింపుల్‌గా ఉంటాడు అని అనిపించుకోవ‌డానికి ఆయ‌న అలా వెళ్లారంటూ విమ‌ర్శించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ మాములుగానే సింపుల్‌గా ఉంటాడు. కాని ఆయ‌న‌కి అది అర్ధం కాక‌ ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనవసరపు చర్చకు తెరలేపాడు. మహేశ్ బాబు బాలీవుడ్ తనకు అవసరం లేదు అనే వ్యాఖ్యలను కూడా ప్రస్తావించాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా నోరు పారేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాం అయింది. సాధార‌ణంగా ఎన్టీఆర్ మీడియాకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు.

ఇటీవల ఒక ఫొటోగ్రాఫర్‌పై జూనియ‌ర్ సీరియ‌స్ కావ‌డం మ‌నం చూశాం. అయితే ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్‌ని ఫొటో తీసింది ఒక‌రు అయితే ఆయ‌న ఫైర్ అయింది త‌న టీమ్‌కి చెందిన మ‌రో వ్య‌క్తిపై అంటూ వీరేంద‌ర్ కామెంట్ చేశాడు. ఇవ‌న్నీ కూడా అత‌ను కావాల‌ని అంటున్నాడ‌ని, వీటిని పెద్ద‌గా పట్టించుకోవ‌ల్సిన అవ‌స‌రం లేద‌ని అభిమానులు చెప్పుకొస్తున్నారు. సౌత్ హీరోలు ఎంత డౌన్ టూ ఎర్త్ ఉన్నా కూడా బాలీవుడ్ కి చెందిన పలువురు ఇలాంటి వ్యక్తులు మాత్రం అకారణంగా నోరు పారేసుకుంటూ ఉంటూ వార్త‌ల‌లో నిల‌వాల‌ని చూస్తారంటూ చెప్పుకొస్తున్నారు.