Mahesh Babu|సినిమాల‌లో మ‌హేష్ బాబుది సొంత వాయిస్ కాదా.. ఆ క‌మెడీయ‌న్ డ‌బ్బింగ్ చెబుతాడా..!

Mahesh Babu| సూప‌ర్ కృష్ణ న‌ట వార‌స‌త్వంతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అద్భుత‌మైన డైలాగ్ డెలివ‌రీ, ఇంటెన్స్ డై

  • By: sn    cinema    Jul 04, 2024 7:43 PM IST
Mahesh Babu|సినిమాల‌లో మ‌హేష్ బాబుది సొంత వాయిస్ కాదా.. ఆ క‌మెడీయ‌న్ డ‌బ్బింగ్ చెబుతాడా..!

Mahesh Babu| సూప‌ర్ కృష్ణ న‌ట వార‌స‌త్వంతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అద్భుత‌మైన డైలాగ్ డెలివ‌రీ, ఇంటెన్స్ డైలాగ్స్, అదిరిపోయే కామెడీ ఇలా ప్ర‌తి దానిలోను మ‌హేష్ బాబు అద‌ర‌గొడుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మ‌హేష్ బాబుకి ఓ సినిమాలో జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ డ‌బ్బింగ్ చెప్పాడ‌ట‌. జ‌బ‌ర్ధ‌స్త్‌తో ఫుల్ ఫేమ‌స్ అయిన బుల్లెట్ భాస్కర్ మిమిక్రీ కూడా చేస్తారు అనే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ముఖ్యంగా ఆయన మహేష్ బాబు వాయిస్ మక్కీకి మక్కీ దించుతారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2014లో విడుదలైన వన్ నేనొక్కడినే చిత్రం మొత్తానికి మ‌హేష్ బాబుకి డ‌బ్బింగ్ చెప్పార‌ట‌.

అయితే ఈ విష‌యాన్ని బుల్లెట్ భాస్క‌ర్ స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం విశేషం. ఈ సినిమాలోనే కాకుండా మహేష్ బాబు నటించిన కొన్ని యాడ్స్ కి కూడా బుల్లెట్ భాస్కర్ డబ్బింగ్ చెప్పారట. అంటే వన్ నేనొక్కడినే చిత్రంలో మీరు వినేది మహేష్ వాయిస్ కాదు. మహేష్ బాబుకు సమయం కుదరనప్పుడు ఇలా బుల్లెట్ భాస్క‌ర్ సాయం తీసుకుంటాడు సూప‌ర్ స్టార్. అయితే ఇంత వ‌ర‌కు కూడా బుల్లెట్ భాస్క‌ర్‌కి మ‌హేష్‌ని క‌లిసే అవ‌కాశం రాలేద‌ట‌. ఈ విష‌యంలో మ‌నోడు కాస్త నిరాశ‌గా ఉన్నాడు. అయితే త్వ‌ర‌లో ఆ కోరిక త‌ప్ప‌క నెర‌వేరుతుందని నెటిజ‌న్స్ అతనికి న‌చ్చ‌జెబుతున్నారు.

ఇక మ‌హేష్ విషయానికి వ‌స్తే..చివ‌రిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. గుంటూరు కారం సినిమా రిలీజై దాదాపు అర్ధ సంవత్సరం కావొస్తున్నా కూడా ఆయన త‌ర్వాతి సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకపోవడం ఫ్యాన్స్‌‌లో ప్రస్టేషన్ పెరిగిపోతున్నది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. మహేష్ బాబు బాబాయ్, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో SSMB28 సినిమా గురించి చెప్పాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో ఉంది. ఈ మూవీ ఆగస్టులో ప్రారంభం అవుతుంది. ఆ నెలలోనే సెట్స్‌పైకి వెళ్తుంది అని ఆయన క్లారిటీతో చెప్పేశాడు. దాంతో మరో నెలలో మూవీ ప్రారంభం కాబోతుంద‌ని తెలిసి ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు.