Unstoppable 4|జైలులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మాట్లాడిన మాట‌లు ఇవే.. చంద్ర‌బాబు స్ట‌న్నింగ్ కామెంట్స్

Unstoppable 4| ఏపీ సీఎం చంద్ర‌బాబు రీసెంట్‌గా అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4కి గెస్ట్‌గా వ‌చ్చి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, అది ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. చంద్ర‌బాబుని బాల‌య్య చాలా ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్టు ప్రోమో ద్వారా అర్ధ‌మైంది. ము

  • By: sn |    cinema |    Published on : Oct 26, 2024 9:11 AM IST
Unstoppable 4|జైలులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మాట్లాడిన మాట‌లు ఇవే.. చంద్ర‌బాబు స్ట‌న్నింగ్ కామెంట్స్

Unstoppable 4| ఏపీ సీఎం చంద్ర‌బాబు రీసెంట్‌గా అన్‌స్టాప‌బుల్(Unstoppable) సీజ‌న్ 4కి గెస్ట్‌గా వ‌చ్చి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, అది ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. చంద్ర‌బాబుని బాల‌య్య చాలా ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్టు ప్రోమో ద్వారా అర్ధ‌మైంది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాన్ జైలులో మిమ్మ‌ల్ని క‌లిసిన‌ప్పుడు ఏమేం మాట్లాడారు అని చంద్ర‌బాబు(Chandrababu)ని బాల‌య్య అడిగారు. దానికి ఏం స‌మాధానం చెబుతారా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూశారు. ‘తిరిగొచ్చిన విజయం’ పేరుతో చంద్ర‌బాబు ఎపిసోడ్ శుక్రవారం రాత్రి ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఇందులో చంద్రబాబు అనేక విష‌యాలు మాట్లాడారు.

జైలులో ఉన్నప్పుడు తనను కలిసేందుకు వచ్చిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍తో చెప్పిన మాటలను చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అందరం కలిసి పోటీ చేద్దామని తాను చూచాయిగా ఆ భేటీలో చెప్పానని చంద్ర‌బాబు అన్నారు. ఆ త‌ర్వాత పొత్తును ప‌వ‌న్ ప్ర‌క‌టించారని చెప్పారు. విశాఖపట్నంలో ఓసారి హోటల్‍లో కూడా ఉండకూడదని పవన్ కల్యాణ్‍(Pawan Kalyan)ను అప్పటి ప్రభుత్వం కట్టడి చేయ‌గా, ఆ స‌మ‌యంలో నేను సంఘీభావం తెలియజేశానని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత తాను జైలుకు వెళ్లానని, హైదరాబాద్ నుంచి పవన్ వచ్చేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నారని చెప్పారు.పవన్ హైదరాబాద్‍ నుండి వ‌చ్చేందుకు ట్రై చేస్తే ఫ్లైట్ క్యాన్సిల్ చేయించారు. రోడ్డు మీద వస్తే నందిగామ దగ్గర ఆపేశారు. వేరే రోడ్డు వైపుగా వస్తే రానీయకపోతే ఆయన రోడ్డు మీద పడుకొని ధర్నా చేశారు.

నా అరెస్ట్ వ‌రకు ప‌వ‌న్‌ని రానీయ‌కుండా అప్ప‌టి ప్ర‌భుత్వం అడ్డుకుంది. నేను జైలులో ఉన్నప్పుడు మీరు, లోకేశ్(Lokesh), పవన్ కల్యాణ్ రాగా, తెలుగు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన మీటింగ్ అది, అక్కడ ఏం జరిగిందనేది ప్రజలు తెలియాలని బాలకృష్ణ అడిగారు. “రెండు నిమిషాలు నేను పవన్ కల్యాణ్ మాట్లాడాం. ధైర్యంగానే ఉన్నారా అని అడిగారు. నా జీవితంలో అధైర్యం ఉండదు, భయపడను అని చెప్పా. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు చూశాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకుండా ప్రయత్నిస్తానని పదేపదే చెప్పారు. ఇద్దరం కలిసి ఓ మాట అనుకున్నాం. అందరం కలిసి పోటీ చేద్దామని చూచాయిగా అన్నాను. ఆయన కూడా ఆలోచించి ఓకే చెప్పారు. బీజేపీని కూడా నచ్చజెప్పి కూటమికి తీసుకొస్తానని అన్నారు అంటూ చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. బ‌య‌టికొచ్చాక ప‌వ‌న్ ముగ్గురు పొత్తు గురించి ప్ర‌క‌టించార‌ని అన్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు(CBN) వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.