Karthi in #Mega158 | ఖైదీతో ఖైదీ.? మెగాస్టార్‌తో కార్తీ – వైరల్ కాంబో..!
మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో కొత్త సినిమా సిద్ధం. మొదట మోహన్‌లాల్ కోసం రాసిన పాత్రలో ఇప్పుడు కార్తీ నటించనున్నాడు. ఆ పాత్రను కాస్తా కామెడీ షేడ్‌లో మార్చినట్లు సమాచారం.
-
మొదట మోహన్‌లాల్ – ఇప్పుడు కార్తీ..
Karthi in #Mega158 | మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో మరో భారీ సినిమా సిద్ధమవుతోందన్న విషయం విదితమే. ‘వాల్తేర్ వీరయ్య’ విజయానంతరం ఈ ఇద్దరూ మళ్లీ కలవబోతున్నారు. వినాయక చవితి సందర్భంగా అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు కొత్త బజ్ ఊపందుకుంది.
తమిళ స్టార్ హీరో కార్తీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడని సమాచారం. ఆసక్తికరంగా, మొదట ఈ పాత్రకు మోహన్‌లాల్‌ను పరిశీలించినప్పటికీ, దృశ్యం 3 షెడ్యూల్ కారణాల వల్ల ఆయన అందుబాటులో లేరని చెబుతున్నారు. అందుకే ఆ పాత్రను కార్తీకి ఆఫర్ చేసినట్టు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదట మోహన్‌లాల్‌ను అనుకున్నప్పుడు ఆ పాత్రను పూర్తిగా సీరియస్ షేడ్‌లో రాసినప్పటికీ, ఇప్పుడు కార్తీ స్టైల్‌కి సరిపడేలా కొంచెం కామెడీ టచ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆ పాత్ర “కామిక్-యాక్షన్ మిక్స్ రోల్”గా మారింది. నాయికలుగా మాళవికా మోహనన్, రాశీ ఖన్నా నటిస్తున్న ఈ చిత్రంలో మరో కొత్త విషయమేమిటంటే, సినిమాకు థమన్ సంగీతం ఇవ్వనున్నాడట.

కార్తీ భారీ రెమ్యునరేషన్
ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న పుకార్ల ప్రకారం, కార్తీ ఈ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో కనిపించనున్నాడు. పలు భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే సీరియస్ యాక్షన్ ప్లస్ కామెడీగా ఈ చిత్రం రూపొందనుంది. ఫిల్మ్‌ఫేర్ కథనం ప్రకారం, కార్తీకి రూ.23 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం తమిళంలోనే ఆయన రూ.12 కోట్ల పరిధిలో తీసుకుంటున్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్ కోసం రెట్టింపు పారితోషికం ఇవ్వనున్నారు.
బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త ప్రాజెక్ట్ కెవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 2026లో షూటింగ్ ప్రారంభం కానుంది. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా జనవరి 12, 2025న విడుదల కానుంది. ఆ తర్వాతే ఈ కొత్త ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తుంది.
కార్తీ తెలుగులో మళ్లీ.. కొత్త అవతారం
కార్తీ గతంలో నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ (2016) సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ చిత్రం కోసం పట్టుబట్టి తెలుగు నేర్చుకుని డబ్బింగ్ కూడా చెప్పిన కార్తీని తెలుగు ప్రేక్షకులు మన హీరోనే అనుకుంటున్నారు. అప్పటి నుంచి ఆయన తెలుగులో మళ్లీ ఎప్పుడు నటిస్తాడా అనే ఆసక్తి కొనసాగుతోంది. ఈసారి ఆయన చిరంజీవితో కలిసి ఆ కలను నిజం చేయనున్నాడనే వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత నాని నిర్మిస్తున్న హిట్ 4 ఎలాగూ ఉంది.
కార్తీ ప్రస్తుతం తమిళంలో చేస్తున్న, చేయబోతున్న వా వాతియార్, సర్దార్ 2, ఖైదీ 2, హిట్ 4(తెలుగు), మార్షన్ ప్రాజెక్టులు పూర్తయ్యాకే ఆయన హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం.
🎬 Chiranjeevi–Karthi Film Buzz: Key Highlights
Megastar Chiranjeevi and director Bobby Kolli are teaming up again for a new high-budget Telugu action-comedy. Tamil hero Karthi roped in for a crucial role.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram