Kaantha Teaser | విధాత: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లోని నిర్మిస్తున్న చిత్రం ‘కాంత’ టీజర్ సోమవారం విడుదలైంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ చూస్తే శాంత అనే సినిమా నిర్మాణం కథాంశంగా కాంత సినిమా రూపుదిద్దుకుంటుందని తెలుస్తుంది. టీజర్ చివరలో ఈ సినిమా పేరు శాంత కాదు..కాంత అని అదే జనానికి నచ్చుతుందని హీరో దుల్కర్ పాత్ర చెప్పడంతో టీజర్ ముగుస్తుంది. శాంత అనే సినిమా విషయంలో దర్శకుడు, హీరోకి మధ్య ఘర్షణ ఇతివృత్తమే కాంత సినిమా అని టీజర్ ద్వారా వెల్లడెంది.
దుల్కర్‌తో కలిసి హీరో రానా తదితరులు ఈ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ హార్రర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం(జులై 28) దుల్కర్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.సెప్టెంబరు 12న ఈ సినిమా విడుదల కానుంది. మహానటి’, ‘సీతారామం’, లక్కీ భాస్కర్ వంటి చిత్రాల విజయంతో క్రేజ్ మీద ఉన్న దుల్కర్ సల్మాన్ కాంత మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తున్నారు.