O Cheliya Movie Teaser | ‘ఓ చెలియా’ టీజర్ విడుదల
నాగ్ ప్రణవ్, కావేరి కర్ణిక హీరోలతో 'ఓ చెలియా' టీజర్ విడుదల; క్రైమ్ & రొమాంటిక్ థ్రిల్లర్ ఫీచర్స్ హైలైట్.

విధాత : నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఓ చెలియా’. ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ ను బుధవారం విడుదల చేశారు. టీజర్ లో హీరోయిరోయిన్ల ప్రేమ సన్నివేశాలు…మోసాల బాబా(అజయ్ ఘోష్) చేతిలో అమ్మాయిలు హత్యకు గురవ్వడం..బాబా మోసాలకు హీరోహీరోయిన్లు బాధితులుగా మారడం వంటి సన్నివేశాలు చూస్తే సినిమా క్రైమ్, రోమాంటిక్ థ్రిల్లర్ గా రాబోతుందని తెలుస్తుంది.
ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ పతాకాలపై రూపాశ్రీ కొపురు ఓ చెలియా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని .’నువ్వే చెప్పు చిరుగాలి…’ అంటూ సాగే పాటను ఈ మధ్యనే మంచు మనోజ్ విడుదల చేశారు. ‘ఓ చెలియా’ సినిమాకు సురేష్ బాలా సినిమాటోగ్రాఫర్, ఉపేంద్ర ఎడిటర్, సంగీతం ఎంఎం.కీరవాణి. త్వరలో విడుదల తేదీ వెల్లడించనున్నారు.