Custom Raids On Malyalam Stars : దుల్కర్ సల్మన్, పృథ్వీరాజ్ ఇళ్లలో కస్టమ్స్ సోదాలు

దుల్కర్ సల్మన్, పృథ్వీరాజ్ ఇళ్లలో కస్టమ్స్ సోదాలు, భూటాన్ నుంచి అక్రమ లగ్జరీ కార్ల దిగుమతి, నకిలీ రిజిస్ట్రేషన్లపై ఆపరేషన్ నుమ్కూర్.

Custom Raids On Malyalam Stars : దుల్కర్ సల్మన్, పృథ్వీరాజ్ ఇళ్లలో కస్టమ్స్ సోదాలు

విధాత: మలయాళ స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీ రాజ్ సుకుమారన్ నివాసాల్లో ఈరోజు కేంద్ర కస్టమ్స్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ నుమ్కూర్‌లో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. భూటాన్ దేశం నుంచి అక్రమంగా లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్న చేసుకోని పన్ను ఎగ్గొట్టడం, ఫేక్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈ దాడులు నిర్వహించారు. ఈ విషయంలో కేరళలో దాదాపు 30 ప్రాంతాంల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. యార్నాకులం జిల్లా, కోచిలోని పానంపిల్లిలోని దుల్కర్ సల్మాన్ ఇంట్లో అలాగే థేవరా, తిరువనంతపురంలోని లోని పృథ్వీరాజ్ ఇళ్లలో రైడ్లు చేశారు. వీరితో పాటు మమ్మూటి నివాసంలో కూడా సోదాలు జరిపారు. భూటాన్ సైన్యం వినియోగించిన విలువైన పాత వాహనాలు ఆక్షన్‌లో కొని అక్రమంగా భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్‌లో నకిలీ రిజిస్ట్రేషన్‌లు చేసి అధిక ధరలకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో స్టార్ కేరళకు చెందిన స్టార్ నటులతో పాటు మరి కొంత మంది హై ప్రొఫైల్ కలిగిన వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు.