మహిళా సినీ నిర్మాత స్వప్న వర్మ ఆత్మహత్య

మహిళా సినీ నిర్మాత స్వప్న వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో స్వప్న వర్మ(33) ఆత్మహత్య చేసుకుంది

 మహిళా సినీ నిర్మాత స్వప్న వర్మ ఆత్మహత్య

విధాత, హైదరాబాద్ : మహిళా సినీ నిర్మాత స్వప్న వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో స్వప్న వర్మ(33) ఆత్మహత్య చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న స్వప్న సొంతూరు రాజమండ్రి. మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి.. కావూరి హిల్స్‌లోని తీగల హౌస్ 101లో స్వప్న ఒంటరిగా ఉంటున్నారు. రెండు రోజుల క్రితం తన ఫ్లాట్‌లో ఫ్యానుకు స్వప్న ఉరివేసుకుంది. ఇంటి నుంచి దుర్గంధం రావడంతో పోలీసులకు చుట్టుపక్కల వారు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా స్వప్న ఉరివేసుకుని చనిపోయి కనిపించింది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.