Movie Rs 99 | సినీ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. రేపు మల్టీప్లెక్స్‌లో రూ.99 సినిమా టికెట్‌..!

Movie Rs 99 | సినీ ప్రియులకు ఇది అదిరిపోయే వార్త. సినిమా లవర్స్‌ డే సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నెల 31న దేశవ్యాప్తంగాఏ భాష సినిమా అయినా.. ఏ షో అయినా కేవలం రూ.99 టికెట్‌ కొనుగోలు చేసి సినిమా చూడొచ్చని ప్రకటించింది.

  • By: Mallanna |    cinema |    Published on : May 30, 2024 9:04 AM IST
Movie Rs 99 | సినీ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. రేపు మల్టీప్లెక్స్‌లో రూ.99 సినిమా టికెట్‌..!

Movie Rs 99 | సినీ ప్రియులకు ఇది అదిరిపోయే వార్త. సినిమా లవర్స్‌ డే సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నెల 31న దేశవ్యాప్తంగాఏ భాష సినిమా అయినా.. ఏ షో అయినా కేవలం రూ.99 టికెట్‌ కొనుగోలు చేసి సినిమా చూడొచ్చని ప్రకటించింది. పీవీఆర్, ఐనాక్స్, సినీపొలిస్ తదితర మల్టిప్లెక్స్‌లో ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా 4వేలకుపైగా స్క్రీన్స్‌లో ఇదే రూ.99 ధరకే టికెట్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. సినిమా ప్రేక్షకులను థిమేటర్‌ వైపు మళ్లించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్‌ వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఐపీఎల్‌ సీజన్‌ కారణంగా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదల కాలేదు. అదే సమయంలో చిన్న సినిమాలు విడుదలై థియేటర్ల వైపు ప్రేక్షకులు రాలేదు. హాలీవుడ్ సినిమాలు సైతం పరిమితంగా విడుదల కాగా.. టికెట్‌ విక్రయాలు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ టికెట్స్‌పై ఆఫర్‌ని ప్రకటించంది.

బుక్ మై షో, పేటీఎం, అమెజాన్ పే తదితర ఆన్‌లైన్‌ వేదిక ద్వారా బుక్‌ చేసుకున్నా రూ.99 టికెట్‌తో పాటు కన్వీనియన్స్‌ ఫీజు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుందని.. థియేటర్‌లో నేరుగా కొనుగోలు ఈ ఛార్జీలు ఏమీ వర్తించవు. అయితే, ఐమ్యాక్స్‌, రిక్లయినర్‌ సీట్లకు మాత్రం రూ.99 ధర వర్తించదని పేర్కొంది. ఇదిలా ఉండగా.. రేపు తెలుగులో గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ, ఛోటా భీమ్‌ ద కర్స్‌ డమ్‌ యాన్‌, హైక్యూ ద డంప్ స్టర్ బ్యాటిల్ తదితర సినిమాలు శుక్రవారం విడుదల కానున్నాయి.