Hero| ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు ఇప్పుడు స్టార్ హీరో.. గుర్తు పడితే నిజంగా గ్రేట్..!
Hero| ఇప్పటి స్టార్ హీరోలందరు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా నటించి తెగ సందడి చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులని అలరించి పెద్దయ్యాక హీరో, హీరోయిన్స్‌గా మారి మంచి పేరు ప్రఖ్యాతలు అందిపుచ్చుకుంటున్నారు. ఇక ఈ పిక్‌లో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరో. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉం

Hero| ఇప్పటి స్టార్ హీరోలందరు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా నటించి తెగ సందడి చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులని అలరించి పెద్దయ్యాక హీరో, హీరోయిన్స్‌గా మారి మంచి పేరు ప్రఖ్యాతలు అందిపుచ్చుకుంటున్నారు. ఇక ఈ పిక్‌లో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరో. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు. మరి ఇప్పటికైన ఆ హీరో ఎవరో గుర్తు పట్టారా.. మరెవరో కాదండి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.
దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన వెంకటేష్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేయడంతో పాటు మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే వెంకటేష్ బాలనటుడిగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ప్రేమ నగర్ లో నటించి అలరించాడు. 1971లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన వెంకటేష్‌కి కూడా మంచి పేరు వచ్చింది. ఇక వెంకీ 1986లో వచ్చిన కలియుగ పాండవులు’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టి ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించాడు.
వెంకటేష్ ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయగా, అవి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చివరిగా సైంధవ్ అనే చిత్రంతో పలకరించాడు.ఈ మూవీ అంతగా అలరించలేకపోయింది. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అయితే ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఇక వెంకీ తన కెరీర్‌లో ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నాడు. 2007లో ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రానికి గానూ ఈయనకు స్వర్ణ నంది అవార్డు లభించింది.ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం.