Hema| కులాంతర వివాహం చేసుకున్న హేమ.. ఆమె లవ్ స్టోరీ భలే ఇంట్రెస్టింగ్‌గా ఉందిగా..!
Hema| గత కొద్ది రోజులుగా హేమ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ ఉండడం, ఆమెకి నిర్వహించిన టెస్ట్‌లలో పాజిటివ్ రావడంతో ఇప్పుడు అంతా కూడా హేమ గురించి ముచ్చటించుకుంటున్నారు. అంతేకాదు ఆమె గురించి తెలుసుకునే

Hema| గత కొద్ది రోజులుగా హేమ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ ఉండడం, ఆమెకి నిర్వహించిన టెస్ట్‌లలో పాజిటివ్ రావడంతో ఇప్పుడు అంతా కూడా హేమ గురించి ముచ్చటించుకుంటున్నారు. అంతేకాదు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. హేమ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో అక్కగా, వదిన, పిన్ని, అత్త పాత్రలలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సుమారు 400 చిత్రాలకు పైగా నటించిన హేమ ఇప్పటికీ అడపాదడపా పలు సినిమాలలో కనిపిస్తూ సందడి చేస్తుంది.
1967 వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు లో జన్మించిన హేమకి చిన్నప్పటి నుండి నటపై ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 1989లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. కాగా హేమ అసలు పేరు కృష్ణవేణి కాగా, సినిమాలలోకి వచ్చాక హేమగా పేరు మార్చుకుంది. క్షణక్షణం చిత్రంలో శ్రీదేవి స్నేహితురాలిగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది హేమ. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రముఖ కెమెరామెన్ సయ్యద్ జాన్ అహ్మద్ ను ప్రేమించి ఇంటలో వారికి చెప్పకుండా పెళ్లి చేసుకుంది. చిన్న వయస్సులోనే వివాహం చేసుకున్న హేమపై ఆమె కుటుంబ సభ్యులు చాలా మండిపడ్డారట. ఈ విషయాన్ని హేమనే ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.
దూరదర్శన్ లో వర్క్ చేసినప్పుడు హేమకి ఆమె భర్త పరిచయం అయ్యారట. అక్కడే తను కూడా అసిస్టెంట్ గా కెమెరా మెన్ గా పనిచేస్తూ ఉన్నాడట. అయితే ఓ సారి ఇద్దరికి ఫస్ట్ మీటింగ్ జరగగా, జూన్ లో పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. అప్పుడు తన వయస్సు 18 క్రాస్ చేస్తుంది. అయితే కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని అన్నాడంటే మోసం చేసే వ్యక్తి కాదని అతనికి ఎస్ చెప్పిందట హేమ. ఇక పెళ్లి తర్వాత వారి వైవాహిక జీవితానికి గుర్తుగా ఒక కూతురికి జన్మనిచ్చారు. ఆ పాప పేరు ఈషా.ఆమె ఇప్పుడు చాలా పెద్దగా అయింది. హీరోయిన్ మెటీరియల్ అని ఆమెని చూసిన వారందరు అంటున్నారు. త్వరలో హేమ తన కూతురిని కూడా సినిమాలలోకి తీసుకొచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక హేమ భర్త జాన్ S.D.లాల్ తనయుడు. నా కెరీర్ ఎదుగుదలకి తన భర్త సహకారం ఎంతో ఉందని హేమ పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది.