HERO|ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు ప‌ట్టారా.. ఇప్పుడు అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు..!

HERO|ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల చిన్న‌ప్ప‌టి పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆ పిక్స్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. చిన్న‌ప్పుడు త‌మ అభిమాన హీరో అలా ఉండేవాడా, అభిమాన హీరోయిన్ ఇలా ఉండేదా అని ముచ్చ‌టించుకుంటూ తెగ మురిసిపోతున్నారు. అయితే ఇప్పుడు

  • By: sn    cinema    Aug 01, 2024 3:15 PM IST
HERO|ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు ప‌ట్టారా.. ఇప్పుడు అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు..!

HERO|ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల చిన్న‌ప్ప‌టి పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆ పిక్స్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. చిన్న‌ప్పుడు త‌మ అభిమాన హీరో అలా ఉండేవాడా, అభిమాన హీరోయిన్ ఇలా ఉండేదా అని ముచ్చ‌టించుకుంటూ తెగ మురిసిపోతున్నారు. అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో క్యూట్ ఫొటో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ పిక్ చూసిన నెటిజ‌న్స్ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. మ‌రి ఇందులో క‌నిపిస్తున్న బుడ్డోడు ఎవ‌రనేది మీకు ఐడియా వ‌చ్చిందా..లేక‌పోతే ఈ స్టోరీ చ‌దివితే మీకే అర్ధం అవుతుంది.

పై ఫోటోలో తాతతో కనిపిస్తున్న ఈ చిన్నోడు మ‌రెవ‌రో కాదు నేచుర‌ల్ స్టార్ నాని. స్వ‌శ‌క్తితో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. ప‌క్కింటి కుర్రాడిలా క‌నిపించే నాని మొదటిగా టీవీ వ్యాఖ్యతగా పని చేసి, ఆ తర్వాత ఇండస్ట్రీలో పలు దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా కూడా పని చేశాడు. అలా కొన్నాళ్లు పనిచేసిన త‌ర్వాత వెండితెర‌పై క‌నిపించాల‌ని అనుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ‘అష్టాచమ్మా’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు.

తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని ఆ త‌ర్వాత విభిన్న క‌థా చిత్రాలు చేశాడు. నాని నటించిన సినిమాల్లో ఈగ, నేను లోకల్, వీ, నిన్ను కోరి, దసరా, శ్యాం సింగరాయ్ వంటి సినిమాలు అత‌నికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. నాని తాజాగా నటిస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. వచ్చేనెల ఆగస్టు 29న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకు సరైన ప్రమోషన్‌ లేదని ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నాని ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఈ హీరో తన స్నేహితురాలు అంజనను 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా, వీరిద్దరికి ఓ కొడుకు ఉన్నాడు. అప్పుడప్పుడు నాని త‌న కొడుకు పిక్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఉత్సాహ‌ప‌రుస్తుంటాడు. నాని కొడుకు ఇప్పుడు చాలా పెద్ద‌య్యాడు. చిన్న‌ప్పుడు నాని ఎలా ఉన్నాడో ఆయ‌న కొడుకు ఇప్పుడు అలానే ఉన్నాడు.