రాజమౌళి.. ఈ పేరు వింటే మనకు ఠక్కున దర్శక ధీరుడు గుర్తుకు వస్తారు. బాహుబలితో తెలుగోడి సత్తా చాటిన రాజమౌళి గురించి ఎవరికి తెలిసి ఉండదు. కాని ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆ రాజమౌళి గురించి కాదు. జబర్ధస్త్ కమెడీయన్ రాజమౌళి. ఈ కామెడీ షోలో తాగుబోతుగా అద్భుతమైన నటన కనబరుస్తూ అందరిని తెగ నవ్వించే రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో పడ్డ కష్టాల గురించి, ఎదుర్కొన్న సమస్యల గురించి తెలియజేశాడు. జబర్ధస్త్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి కమెడీయన్ రాజమౌళి చాలా సుపరిచితం. ఆయన కామెడీ స్కిట్స్‌లో ఎక్కువగా తాగుబోతు పాత్రలే ఉంటాయి. లేదంటే అమయాకంగా కనిపించడం.
మనోడు సిట్యుయేషన్‌కి తగ్గట్టు పేరడి పాటలు పాడుతూ అనేక మంది అభిమానులని కూడా ఏర్పరచుకున్నాడు.జబర్ధస్త్‌తో పాటు పలు షోలలో కూడా తెగ సందడి చేస్తున్న రాజమౌళి తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చి న ఇంటర్వూలో మాది చాలా మారుమూల పల్లెటూరు .. అందువలన చిన్నప్పటి నుంచి తాగుబోతులను చాలా దగ్గరగా చూసానని చెప్పుకొచ్చాడు. అయితే వారు ఆ సమయంలో వాళ్లు ఎలా మాట్లాడతారు .. ఎలా ప్రవర్తిస్తారు అనేది క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశాను కాబట్టి తాగుబాతు పాత్ర అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నట్టు స్పష్టం చేశాడు.
ఇక నటన అనేది తన ఇంట్లోనే ఉందని అన్నారు. అప్పట్లో మా నాన్న డ్రామాలు ఎక్కువగా వేసేవారు. ఆ డ్రామాలను చూస్తూ ఉండటం వలన నాకు నటనపై ఆసక్తి ఏర్పడడం, కాలేజ్ రోజులకి వచ్చేసరికి నటిస్తూ.. మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నట్టు తెలియజేశారు రాజమౌళి. ఇక నటుడిగా కెరియర్ మొదలు పెట్టిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. అయితే కరోనా సమయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కరోనా సమయంలో నాకు చాలా సీరియస్ అయింది. ఆసుపత్రిలో చేరడం, పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం జరిగింది. చనిపోతాననే అంతా అనుకున్నారు. అదృష్టం కొద్ది బ్రతికాను. ఇది నాకు పునర్జన్మనే అని రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు.