బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్‌తో తెలుగు ప్రేక్షకులకి చాల దగ్గరయ్యాడు వేణు. సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించాడు. నటుడిగా వేణుకి మంచి గుర్తింపు ఉంది. అయితే, ఈ ఏడాది బలగం సినిమాకు దర్శకత్వం వహించి తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టారు. తొలి సినిమాతోనే వేణు అందరి ప్రశంసలను అందుకున్నారు. తెలంగాణ గ్రామీణ భావోద్వేగాలు ఎంతో అద్భుతంగా తెరక్కించిన వేణుని సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసించారు. ఇక బలగం చిత్రం అంతర్జాతీయంగా అనేక అవార్డులు సొంతం చేసుకుంటోంది. ఇలాంటి ఆనందం సమయంలో వేణు గుడ్ న్యూస్ పంచుకున్నాడు.
తన సతీమణి తాజాగా పండండి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ హ్యాపీ న్యూస్ ని వేణు సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేశాడు. మాకు అమ్మాయి జన్మించింది. ఈ శుభవార్తని మీ అందరితో షేర్ చేయడానికి చాలా సంతోషిస్తున్నా అంటూ వేణు పోస్ట్ చేశారు. వేణుకి ఆల్రెడీ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి పుట్టడంతో వేణు ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో మునిగారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, వేణు సన్నిహితులు, ఫ్యాన్స్ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వేణు బలగం తర్వాత మరో కొత్త చిత్రం ప్రకటించలేదు. ఒకవేళ రెండో మూవీ చేసేట్టు అయితే అది కూడా దిల్ రాజు నిర్మాణంలోనే ఉంటుందని సమాచారం.
బలగం చిత్రంతో వేణు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని కంటతడి పెట్టించాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చూపిన బలగం సినిమా సుమారు రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొంది రూ.26కోట్లపై పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు అంచనా. కలెక్షన్లను మాత్రమే కాకుండా మంచి సినిమాగా అందరి మనసులను బలగం గెలిచింది. ‘జబర్దస్ వేణు’ ఈ చిత్రంతో.. ‘బలగం వేణు’ అయ్యారు.