Jabardasth | బుల్లితెర లేడి కమెడీయన్స్ లో రోహిణి ఒకరు. సీరియల్స్ లో సత్తా చాటి ఆ తర్వాత జబర్ధస్త్ కార్యక్రమంలో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే రోహిణికి బిగ్ బాస్ ఆఫర్ కూడా దక్కింది. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు సందడి చేస్తూ తెగ వినోదం పంచింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు జబర్ధస్త్ టీమ్ లీడర్‌గా కూడా మారింది.తనదైన పంచ్‌లతో కామెడీ పంచుతూ కడుపుబ్బ నవ్విస్తుంది. రోహిణి ఒకవైపు షోస్ చేస్తూనే మరోవైపు […]
Jabardasth |
బుల్లితెర లేడి కమెడీయన్స్ లో రోహిణి ఒకరు. సీరియల్స్ లో సత్తా చాటి ఆ తర్వాత జబర్ధస్త్ కార్యక్రమంలో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే రోహిణికి బిగ్ బాస్ ఆఫర్ కూడా దక్కింది. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు సందడి చేస్తూ తెగ వినోదం పంచింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు జబర్ధస్త్ టీమ్ లీడర్‌గా కూడా మారింది.తనదైన పంచ్‌లతో కామెడీ పంచుతూ కడుపుబ్బ నవ్విస్తుంది.
రోహిణి ఒకవైపు షోస్ చేస్తూనే మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. కెరీర్లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు తాజాగా తన లవ్ , బ్రేకప్ విషయాల గురించి తొలిసారి స్పందించింది. ఇన్నాళ్లు తన లైఫ్‌లో లవ్ వంటివి లేవనుకున్న వారికి ఆమె చెప్పిన మాటలు షాకింగ్‌గా మారాయి.
రోహిణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు తనకి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని చెప్పింది. అయితే అతడు తనతో లవ్‌లో ఉంటూ వేరే అమ్మాయితో తిరిగేవాడని ఆ సమయంలో నాకు నరకం కనిపించింది అని రోహిణి పేర్కొంది.
నాతో లవ్‌లో ఉంటూ వేరే అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావు అని బాయ్ ఫ్రెండ్‌కి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకినట్టు చెప్పిన రోహిణి అతడికి బ్రేకప్ చెప్పిందట. ఎంతో నమ్మకంతో ప్రేమిస్తే.. అతడు చీట్ చేయడం వలన చాలా డిప్రెషన్‌కి వెళ్లానని పేర్కొంది. ఫ్రెండ్స్ వలన తను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చినట్టు తెలియజేసింది.
ఇక తన లవ్ బ్రేకప్ అయిన సమయంలో రోహణికి తన ఫ్రెండ్స్ చాలా మద్దతుగా ఉన్నారని చెబుతూ వారు అన్న మాటలని కూడా గుర్తు చేసుకుంది. అసలు వాడు ఎవడు, వాడు నీ కాలి గోటికి కూడా సరిపోడు అని నాకు చాలా ధైర్యం ఇచ్చారని రోహిణి పేర్కొంది.
అయితే ఆ సమయంలో నేను వాడు ఒక ఆఫ్ట్రాల్ గాడు.. వీడి గురించి ఇంతలా ఆలోచించడం ఏంటని నన్ను నేను ప్రశ్నించుకొని ఫ్రెండ్స్ సపోర్ట్‌తో డిప్రెషన్ నుంచి బయట పడ్డానని తెలియజేసింది రోహిణి. అయితే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే రోహిణి జీవితంలో కూడా ఇంతటి కష్టాలు ఉన్నాయా అని అందరూ ఆశ్చర్య పోతున్నారు.