Jabardasth Pavitra| జబర్ధస్త్ పవిత్ర కారు ప్రమాదం.. ఇష్టపడి కొనుకున్న కారు నుజ్జు నుజ్జు
Jabardasth Pavitra| ఇటీవల రోడ్డు ప్రమాదాల గురించి ఎక్కువగా వింటున్నాం. రీసెంట్‌గా త్రినయని సీరియల్ ఫేం పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆమె మృతిని జీర్ణించుకోని ప్రియుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ షాక్ నుంచి కోలుకోకముందే.. జబర్దస్త్ కం

Jabardasth Pavitra| ఇటీవల రోడ్డు ప్రమాదాల గురించి ఎక్కువగా వింటున్నాం. రీసెంట్‌గా త్రినయని సీరియల్ ఫేం పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆమె మృతిని జీర్ణించుకోని ప్రియుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ షాక్ నుంచి కోలుకోకముందే.. జబర్దస్త్ కంటెస్టెంట్ పవిత్ర కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం, ఆ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు కావడం వెలుగులోకి వచ్చింది. జరిగిన ప్రమాదం గురించి పవత్ర తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పవిత్ర తన పిన్ని, ఆమె పిల్లలతో కలిసి సొంత ఊరుకి తన కారులో వెళుతుంది. అయితే నెల్లూరు జిల్లా ఉప్పలపాడు వద్ద తన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.
ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించబోయి.. పవిత్ర ప్రయాణం చేస్తున్న కారు రోడ్డు కింద గోతులోకి వెళ్లి నుజ్జు నుజ్జు అయింది.కారు ముందు టైర్ ఊడిపడిపోవడంతో పాటు పలు భాగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన తీరును గుర్తుచేసుకుంటూ.. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డామని, ఆ ప్రమాదం నుండి బయటపడి బతుకుతామనే నమ్మకం కలగలేదని పవిత్ర ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. ఈ ప్రమాదంలో పవిత్రకు చిన్న చిన్న గాయాలు కాగా,తనతో ప్రయాణిస్తున్న ఆమె బంధువులకు కూడా చిన్నపాటి గాయాలు అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో కార్ మాత్రం తుక్కుతుక్కు అయింది. భయానక ఘటన నుంచి బయటపడటానికి తనకు చాలా సమయం పట్టిందని పవిత్ర అంటుంది.
తన కారు యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది గుర్తు పట్టారు కాని ఎవరు సాయం చేయడానికి రాలేదట. వీడియోలు తీసుకుంటూ ఉండడం చూసి నాకు చాలా బాధేసింది అని చెప్పుకొచ్చింది పవిత్ర. ప్రస్తుతం పవిత్ర షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కాగా, ఆమెకి పలువురు ధైర్యం చెబుతున్నారు. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర.. పలు టీవీ షోలు, సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. పవిత్ర.. . కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా ఈ మధ్య సినిమాల్లో కూడా కనిపిస్తూ తనదైన కామెడీతో అలరిస్తుంది.