Kalki| పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రబాస్ గత కొద్ది రోజులుగా కల్కి 2898 ఏడీ అనే సినిమా చేస్తుండగా, ఈ మూవీ విడుదల తేదీని ఎప్పుడో ఫిక్స్ చేయగా.. దాన్ని మార్చేశారు. ఇప్పుడు అఫీ
Kalki| పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రబాస్ గత కొద్ది రోజులుగా కల్కి 2898 ఏడీ అనే సినిమా చేస్తుండగా, ఈ మూవీ విడుదల తేదీని ఎప్పుడో ఫిక్స్ చేయగా.. దాన్ని మార్చేశారు. ఇప్పుడు అఫీషియల్ రిలీజ్ డేట్ ను కన్ఫార్మ్ చేశారు. వైజయంతి మూవీస్ కు కలిసి వచ్చిన మే 9వ తేదీన రిలీజ్ చేయాలని మొదట చిత్ర బృందం భావించింది. ఆ డేట్‌న చిరంజీవి, శ్రీదేవి కాంబోలో వచ్చిన జగదీకవీరుడు.. అతిలోక సుందరి రిలీజ్ అయింది. టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన ఈ సినిమా రిలీజ్ రోజునే కల్కి చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు.
ఎలక్షన్స్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వలన మూవీని వాయిదా వేశారు. ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 27వ తేదీన ప్రభాస్ హీరోగా రాబోతున్న కల్కి 2898 ఏడీ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు..2020లో ఈ సినిమా గురించి తొలిసారి ప్రకటన చేయగా, మూడేళ్లకు సినిమా విడుదలకు మోక్షం కలుగుతున్నట్టు అయింది. మరి వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ దాదాపు 600 కోట్ల బారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
కల్కి 2898 ఏడీ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుంది. బిగ్ బీ అమితా బచ్చన్, లోకనాయకుడు కనమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సస్వత ఛటర్జీ, పశుపతి, గౌరవ్ చోప్రా, మండవ సాయి కుమార్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక కల్కి సినిమాతో పాటు పలు ప్రాజెక్టులు కూడా ప్రభాస్ చేతిలో ఉన్నాయి. సలార్ 2, రాజాసాబ్ వంటి మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.