Katrina Kaif| క‌త్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ రూమ‌ర్స్.. ఎట్ట‌కేల‌కి స్పందించిన విక్కీ కౌశ‌ల్

Katrina Kaif| పొడుగు కాళ్ల సుంద‌రి క‌త్రినా కైఫ్ తెలుగు ప్రేక్ష‌కులకి కూడా చాలా సుప‌రిచితం. అందం, అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ని కొల్ల‌గొట్టింది. అ

  • By: sn    cinema    Jul 16, 2024 6:48 AM IST
Katrina Kaif| క‌త్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ రూమ‌ర్స్.. ఎట్ట‌కేల‌కి స్పందించిన విక్కీ కౌశ‌ల్

Katrina Kaif| పొడుగు కాళ్ల సుంద‌రి క‌త్రినా కైఫ్ తెలుగు ప్రేక్ష‌కులకి కూడా చాలా సుప‌రిచితం. అందం, అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ని కొల్ల‌గొట్టింది. అయితే ఈ అమ్మ‌డు కొన్ని నెల‌ల క్రితం బాలీవుడ్ హీరో విక్కీ కౌశ‌ల్‌ని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇక వారి వివాహం కన్నుల పండుగ‌గా జ‌రిగింది. అయితే గ‌త ఆరు నెల‌లుగా క‌త్రినా కైఫ్ ప్ర‌గ్నెంట్ అంటూ వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అనంత్ అంబానీ – రాధికా మెర్చంట్ వివాహానికి హాజ‌రైన స‌మ‌యంలోనూ ఆమె గర్భంతో ఉన్నారన్న పుకార్లు వచ్చాయి. గ‌ర్భం ఎవ‌రు గుర్తించ‌కుండా ఆమె దాచార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ విష‌యంపై ఎట్ట‌కేల‌కి క‌త్రినా భ‌ర్త విక్కీ కౌశ‌ల్ స్పందించాడు.

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్ న్యూస్ అనే మూవీ చేస్తుండ‌గా, ఈ మూవీలో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుంది. జూలై 19న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో కత్రినా ప్రెగ్నెన్సీ గురించి విక్కీని ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. కొన్నాళ్లుగా తన భార్య కత్రినా కైఫ్ గురించి.. ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్త‌లు అని అవాస్త‌వ‌మ‌ని ఆయ‌న అన్నారు. అందులో నిజం లేదు అని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఏ విష‌యం జ‌రిగిన కూడా మేము సంతోషంగా ప్ర‌కటిస్తాము. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న వార్త‌ల‌లో ఎలాంటి నిజం లేదు అని విక్కీ కౌశ‌ల్ అన్నాడు.

కత్రినా కైఫ్ ఇటీవల లండన్‍కు వెళ్లగా.. విక్కీ కౌశల్ కూడా కొద్ది రోజుల‌కి అక్క‌డికి వెళ్లాడు. అయితే, కత్రినా ప్రెగ్నెన్సీతో ఉన్నారని, ప్రసవం కోసమే అక్కడికి వెళ్లారంటూ తెగ ప్ర‌చారాలు సాగాయి. ఆ స‌మ‌యంలో క‌త్రినా టీమ్ వాటిని ఖండించింది. అయిన‌ప్ప‌టికీ రూమ‌ర్స్ ఆగడం లేదు. క‌నీసం విక్కీ కౌశ‌ల్ ఇచ్చిన క్లారిటీతో అయిన పుకార్ల‌కి చెక్ ప‌డుతుందా లేదా అనేది చూడాలి. ఇక క‌త్రినా కైఫ్ ప్ర‌స్తుతం సినిమాల‌కి దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే. చివ‌రిగా మేరీ క్రిస్మస్ చిత్రంలో కత్రినా నటించారు. ఈ మూవీ జూన్ 12వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది.