Mahavatar Narasimha | రూ.150కోట్లు వసూళ్లను దాటేసిన మహావతార్ నరసింహ
మహావతార్ నరసింహ రూ.150 కోట్లు దాటి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హోంబలే ‘మహావతార్ యూనివర్స్’లో మొదటి సినిమా ఇది.
Mahavatar Narasimha | విధాత : యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ధ సింహగర్జన చేస్తుంది. ఆగస్టు 8 వరకు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల వసూళ్లను దాటేసి మరిన్న వసూళ్ల సాధనలో దూసుకెలుతుంది. ఇప్పటికే ప్రదర్శతమవుతున్న స్క్రీన్లు కాకుండా..ప్రేక్షకుల కోరిక మేరకు కొన్నిచోట్ల అదనపు స్క్రీన్లలో కూడా ప్రదర్శిస్తున్నారు. కేవలం మౌత్ టాక్ తో హిట్ టాక్ సొంతం చేసుకున్న మహావతార్ నరసింహ మూవీ ఫుల్ రన్ లో రూ. 200కోట్ల వసూళ్లను కూడా సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. ఎలాగు ఓటీటీ హక్కులు వగైరా ఆదాయం ఉండనే ఉంది.
హోంబలే ఫిల్మ్స్ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా ఏడు సినిమాలను అందించనున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా రానున్న రెండో సినిమా ‘మహావతార్ : పరశురామ్’ రాబోతుందని తాజాగా దర్శకుడు అశ్విన్‌కుమార్ తెలిపారు. 2027లో ఈ సినిమా విడుదల కానుంది. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రెండేళ్లకు ఒకటి చొప్పున మొత్తం ఏడు సినిమాలు రానున్నాయి. విష్ణుమూర్తి పది అవతారాలపై ఇవి రూపొందుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
జూనియర్లకు డ్రగ్స్ అలవాటు చేసిన సీనియర్ మెడికోలు
ఇలా చేస్తే సహజంగానే అదుపులోకి బీపీ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram