Mahavatar Narsimha | రూ.100కోట్ల మార్క్ దాటిన ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’ కలెక్షన్స్

బాక్సాఫీస్ దుమ్ములేపుతున్న ‘మహావతార్ నరసింహ’ సినిమా.. 10 రోజుల్లో ₹105 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి యానిమేటెడ్ సినిమాల రికార్డు బ్రేక్ చేసింది. హోంబలే సంస్థ రూపొందిస్తున్న మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది తొలి భారీ విజయవంతమైన చిత్రం.

Mahavatar Narsimha | రూ.100కోట్ల మార్క్ దాటిన ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’ కలెక్షన్స్

Mahavatar Narsimha | విధాత, హైదరాబాద్ : ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’ సినిమా బాక్సాఫిస్ కలెక్షన్లలో ఉగ్ర రూపం చూపిస్తుంది. యానిమెటెడ్ సినిమాగా విడుదలైన ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’ ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకుని కలెక్షన్లలో దూసుకెలుతుంది. రోజురోజుకు స్క్రీన్ల సంఖ్య పెంచుకుంటు వెలుతున్న ‘మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌’ కలెక్షన్స్ తాజాగా రూ.105 కోట్ల మార్కును దాటాయని చిత్ర నిర్మాణసంస్థ హోంబలే పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇండియాలో ఇప్పటివరకూ రూ.105 కోట్లు వసూలుచేసినట్లు తెలిపింది. పది రోజుల్లో ఈ ఘనత సాధించింది. మొదటిరోజు రూ.1.35 కోట్లు మాత్రమే రాబట్టిన చిత్రం పదో రోజు ఏకంగా రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఇప్పటికే ఈ సినిమా దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్‌ ఫిల్మ్‌గా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.

హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా విష్ణువు దశావతారాలపై రెండేళ్లకు ఒకటి చొప్పున వరుసగా ఏడు సినిమాలను అందించనున్న విషయం తెలిసిందే. వరాహా, నరసింహ అవతారాలపై మహావతార్ సినిమా మొటగా విడుదలై భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. తదుపరి వచ్చే సినిమా ‘మహావతార్‌ పరశురామ్‌’ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని తాజాగా దర్శకుడు అశ్విన్‌కుమార్‌ తెలిపారు. 2027లో ఆ సినిమా విడుదల కానుంది.