Kalki 2898 AD Collections | హిందీలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ రికార్డ్ కలెక్షన్స్..! ఇదే రోజు కొనసాగితే రూ.300కోట్లు పక్కా..!
Kalki 2898 AD Collections | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కీ 2898 ఏడీ. మూవీ విడుదలై రెండువారాలు కావొస్తున్నది. అయినా, కూడా మూవీ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా హిందీ నార్త్ బెల్ట్‌లో ఇప్పటికే కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 2024లో విడుదలైన హిందీ చిత్రాల్లోనే అత్యధిక గ్రాసర్‌గా నిలిచింది.

Kalki 2898 AD Collections | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కీ 2898 ఏడీ. మూవీ విడుదలై రెండువారాలు కావొస్తున్నది. అయినా, కూడా మూవీ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా హిందీ నార్త్ బెల్ట్‌లో ఇప్పటికే కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 2024లో విడుదలైన హిందీ చిత్రాల్లోనే అత్యధిక గ్రాసర్‌గా నిలిచింది. దేశంలోనూ ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఎక్కువగా కలెక్షన్లు వసూలు చేసిన మూవీగా ఘనత సాధించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా శనివారం నాటికి రూ.865కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీలో ఈ మూవీ పదిరోజుల్లోనే రూ.190కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆదివారం మూవీ బుకింగ్స్ జోరు చూస్తుంటే మరో ఒకేరోజు రూ.20కోట్లకుపైగానే రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాంతో ‘కల్కి 2898ఏడీ’ మూవీ రూ.200 కోట్ల నెట్ గ్రాస్‌ను రాబట్టిన చిత్రంగా నిలవనుంది. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటించిన రెండో చిత్రం రూ.200 కోట్లు వసూళ్లను రాబట్టడం మాములు విషయం ఏమీ కాదని సినీ పండితులు పేర్కొంటున్నారు. తెలుగు సహా సౌత్‌లో మరే హీరో సినిమా రెండోసారి రూ.200 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన ఘనత లేదు. దక్షిణాది సినిమాల్లో బాహుబలి-2, కేజీఎఫ్-2, ఆర్‌ఆర్‌ఆర్ మూవీలు మాత్రమే హిందీలో రూ.200కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాయి. బాహుబలి-2 ఏకంగా రూ.500 కోట్ల నెట్ వసూళ్లను సాధిస్తే.. కేజీఎఫ్-2 దాదాపు రూ.430 కోట్లు వసూలు చేశాయి. ఇక ఆర్ఆర్ఆర్ కేవలం హిందీలో రూ.245 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టాయి. రూ.100 కోట్లకుపైగా నెట్ వసూళ్లను సాధించిన ఆరో మూవీగా కల్కి 2898 ఏడీ మూవీ నిలిచింది. బాహుబలి-2 తర్వాత రూ.200 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. మరి రాబోయే రోజుల్లో మూవీ రూ.300కోట్లు వసూలు చేస్తుందా? లేదా చూడాల్సిందే.