Naga Chaitanya| నాగ చైతన్య, సమంత టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వివాహం
Naga Chaitanya| నాగ చైతన్య, సమంత టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని మూడు నాలుగేళ్లు సంతోషంగానే ఉన్నా అనుకోని కారణాల వలన వారిద్దరు విడిపోయారు. ఇప్పుడు ఎవరి దారులు వారివే. అయితే అభిమానులు మాత్రం ఇప్పటికీ సమంత, నాగ చైతన్య విడాకుల విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తిరిగి కలిస్తే బాగుండని కొందరు అనుకుంటుంటే, కనీసం ఇద్దరు కలిసి ఒక సినిమా అయినే చేస్తే చూడాలని ఉందని మరి కొందరు చెప్పుకొస్తున్నారు. సమంత- నాగ చైతన్య తొలిసారి ఏ మాయ చేశావే అనే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలు చేశారు.
మనం మూవీ మే23తో పదేళ్లు పూర్తి చేసుకుంది.2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఇందులో నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత కీలకపాత్రలు పోషించారు. అఖిల్, అమల అతిథి పాత్రలలో కనిపించి సందడి చేశారు. అయితే హైదరాబాద్‌లో ఈ సినిమా రిరీలీజ్ షో దేవి థియేటర్లో పడింది. నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్‌తో పాటు కొందరు మూవీ సభ్యులు ఈ సినిమాని చూసేందుకు థియేటర్‌కి వచ్చారు. అయితే సమంత, నాగ చైతన్య పెళ్లి సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు తెగ గోల్ చేశారు. ఆ సమయంలో నాగ చైతన్య కాస్త అసహనానికి గురైనట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక మనం మ్యూజిక్ ప్రతి ఒక్కరికి హాయిని పంచుతుంది. అనూప్ మ్యూజిక్ కెరీర్లో నే ఈ సినమా అద్భుతమైన సినిమా అవుతుంది. అందులోని ప్రతీ పాట ప్రతీ ఒక్క ప్రేక్షకుడి మనసును హత్తుకుంది. అసలు ఆ సినిమాలోని ప్రాణం అంతా కూడా ఆ పాటల్లోనే ఉంటుంది అని చెప్పాలి. ప్రతీ పాటను అనూప్ అద్భుతంగా మలిచాడు కాబట్టే మనం సినిమా అంత పెద్ద హిట్ అయింది.ఈ మూవీకి సీక్వెల్ కూడా వస్తుందని అప్పట్లో ప్రచారాలు సాగాయి. కాని దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు