Naga Chaitanya|నాగ చైతన్యకి రాఖీ కడతానన్న సమంత… ఇదేం ట్విస్ట్ రా సామి..!
Naga Chaitanya| గత కొద్ది రోజులుగా నాగ చైతన్య పేరు వార్తలలో తెగ నానుతూ వస్తుంది. అందుకు కారణం సమంతతో విడిపోయిన తర్వాత సింగిల్‌గా ఉన్న చైతూ ఆగస్ట్ 8న మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్లని వివాహం చేసుకోవడమే.. చైతన్య, శోభితల మధ్య ప్రేమ 2022లోనే మొదలైందని రీసెంట్గా శో

Naga Chaitanya| గత కొద్ది రోజులుగా నాగ చైతన్య పేరు వార్తలలో తెగ నానుతూ వస్తుంది. అందుకు కారణం సమంతతో విడిపోయిన తర్వాత సింగిల్‌గా ఉన్న చైతూ ఆగస్ట్ 8న మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్లని వివాహం చేసుకోవడమే.. చైతన్య, శోభితల మధ్య ప్రేమ 2022లోనే మొదలైందని రీసెంట్గా శోభిత సోదరి సమంత బయటపెట్టింది. చైతూ-శోభిత ఎంగేజ్మెంట్ ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె క్యాప్షన్ లో ఈ విషయాన్ని కూడా షేర్ చేయడంతో అందరు కూడా దానిపై ఓ లుక్ వేశారు. సమంత నుండి విడిపోయిన తర్వాత మనోడు శోభితకి దగ్గరయ్యాడని, వారి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ కావడంతో ఇప్పుడు పెళ్లికి కూడా రెడీ అయ్యారని టాక్ నడుస్తుంది.
అయితే తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకోగాచ కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటుండగా, శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు నాగ చైతన్య. అయితే నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు సమంత అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్‌లో నాగ చైతన్యతో ఫొటోలు ఇప్పటికి అలాగే ఉన్నాయి. మరోవైపు చైతూ సోషల్ మీడియా పేజ్‌లో కూడా సమంత పిక్స్ ఉన్నాయి.
ఒకరిపై ఒకరికి ప్రేమ ఇంకా అలానే ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.కాకపోతే ఇద్దరు విడిపోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యారు కాబట్టి ఎవరి దారులు వారు చూసుకుంటున్నారు. చైతూ నుండి విడిపోయినప్పటికీ సమంత అక్కినేని ఫ్యామిలీలోని కొందరితో ఇంకా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే సమంత- నాగ చైతన్యల లవ్ నాలుగేళ్ల పాటు సాగిందట. వారి రిలేషన్షిప్ గురించి ఇంట్లో చెప్పడానికి చైతూ చాలా భయపడ్డాడట. ఇంట్లో ఎలా రియాక్ట్ అవుతారోనని చైతూ చాలా ఆలోచించేవాడట. దీంతో సామ్ నువ్వు ఇప్పుడు చెప్పకపోతే రాఖీ కట్టేస్తానని బెదిరించిందట. అప్పుడు జరిగిన ఈ సంఘటనకి సంబంధించిన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా, దీనిపై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో సరదాగా ఉండే వారు ఎందుకు విడిపోయారో ఏమో అంటున్నారు.