Nandamuri Tejaswini : కమర్షియల్ యాడ్ లో బాలయ్య కూతురు తేజస్వీని మెరుపులు

బాలయ్య కూతురు తేజస్వీని కమర్షియల్ యాడ్ లో నటించి అందం, అభినయంతో సోషల్ మీడియాలో మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకుంది.

Nandamuri Tejaswini : కమర్షియల్ యాడ్ లో బాలయ్య కూతురు తేజస్వీని మెరుపులు

విధాత : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య చిన్న కూతురు తేజస్వీని సినిమాల్లో నటించకపోయినా..తాజాగా ఓ కమర్షియల్ యాడ్ లో నటించి మెరుపులు మెరిపించింది. సిద్దార్ధ ఫైన్ జ్యూవెలరీ యాడ్ లో తందనాన తార..నా మెరుపులెస్సా హారా..మిలమిలమెరిసినా తారా అంటూ తేజస్వీని చూపిన అందం..అభినయం…క్యాస్టూమ్స్, జ్యూవెలరీ, హవాభావాలు అద్దిరిపోయాయి. యాడ్ లో ఆమె నటన చూస్తే ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఉన్నట్లుగా ఈజీగా నటించేసింది. యాడ్ లో తేజస్వీని ఫెర్ఫార్మెన్స్ చూసిన నెటిజన్లు.. ఎంతైనా నందమూరి నట సింహం బాలయ్య వారసులు కదా..నటనలో ఆ మాత్రం ఉంటుందంటున్నారు.

ట్రెక్కింగ్ తో ప్రారంభమయ్యే యాడ్ లో తేజస్వీని తేజస్వీని నటన..నా ఆత్మ విశ్వాసం, నా ఆనందం, నా ఉత్సాహం, నా అనుబంధం, నా సంతోషం, మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన ఆభరణాలు..సిద్దార్ధ ఫైన్ జ్యూవెలరీ అంటూ తేజస్వీని తన అందం..అభినయంతో అద్బుతమైన ప్రమోషన్ అందించింది.