Prize Money|నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్‌కి ఎంత ప్రైజ్‌మ‌నీ ఇస్తారు.. పుర‌స్కారంతో పాటు ఇంకేమి ఇస్తారు..!

Prize Money| ప్ర‌తి ఒక్క న‌టుడికి జాతీయ అవార్డ్ అందుకోవ‌డం ఒక క‌ల‌. ఈ అవార్డ్ ద‌క్కించుకోవాల‌ని ఎంతో మంది న‌టులు క‌ల‌లు కంటూ ఉంటారు. అయితే రీసెంట్‌

  • By: sn    cinema    Aug 17, 2024 7:45 AM IST
Prize Money|నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్‌కి ఎంత ప్రైజ్‌మ‌నీ ఇస్తారు.. పుర‌స్కారంతో పాటు ఇంకేమి ఇస్తారు..!

Prize Money| ప్ర‌తి ఒక్క న‌టుడికి జాతీయ అవార్డ్ అందుకోవ‌డం ఒక క‌ల‌. ఈ అవార్డ్ ద‌క్కించుకోవాల‌ని ఎంతో మంది న‌టులు క‌ల‌లు కంటూ ఉంటారు. అయితే రీసెంట్‌గా 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన చేయ‌గా, ఇందులో మ‌న తెలుగు సినిమా కార్తికేయ‌2కి జాతీయ అవార్డ్ ద‌క్కింది. ఉత్తమ నటుడు రిషబ్‌ శెట్టి(కాంతార-కన్నడ) ద‌క్కించుకున్నాడు. ఉత్తమ దర్శకుడు: సూరజ్‌ ఆర్‌ బర్జాత్యా(ఊంచై)(హిందీ),ఉత్తమ నటి : నిత్యా మీనన్‌(తిరుచిత్రంభలం-తమిళం)- మనసి పరేఖ్‌(కుచీ ఎక్స్ ప్రెస్‌-గుజరాతీ)ల‌కి ద‌క్కాయి. అయితే జాతీయ అవార్డ్ అందుకున్న టెక్నీషియ‌న్స్‌కి సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌ల వర్షం కురుస్తుంది.

ఇదిలా ఉంటే జాతీయ అవార్డ్ గెలుచుకున్న వాళ్లకు దక్కే ప్రైజ్​మనీ ఎంత? పురుస్కారంతో పాటు ఇంకేమి అంద‌జేస్తారు అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. అయితే నేషనల్ అవార్డు ద‌క్కించుకున్న వారికి పురస్కారంతో పాటు నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. అలాగే ప్రశంసా పత్రం కూడా ఇస్తుంది. జాతీయ చలనచిత్ర విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతిని కూడా అందజేస్తారు. వాళ్ల ప్రతిభకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను కూడా బహూకరిస్తారు. అయితే జ్యూరీ అభినందనలు అందుకున్న ఫిల్మ్స్​కు మాత్రం కేవలం సర్టిఫికేట్ మాత్రం ఇస్తారు. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ కేటగిరీల్లో విజేతలకు రూ.3 లక్షల రూపాయ‌ల డ‌బ్బుని అందిస్తుంది ప్ర‌భుత్వం.

ఇక మిగిలిన విభాగాల్లో పురస్కారాలకు ఎంపికైన వారికి అవార్డు, ప్రశంసా పత్రంతో పాటు రూ.2 లక్షల నగదు లభిస్తుంది. ఉత్తమ నటుడిగా ఎంపికైన రిషబ్ శెట్టికి రూ.2 లక్షలు, ఉత్తమ నటిగా నిలిచిన నిత్యా మీనన్​, మానసి పరేఖ్​కు చెరో రూ.2 లక్షల ప్రైజ్​మనీ ద‌క్కించుకుంటారు. తెలుగు నుంచి బెస్ట్ ఫిల్మ్​గా ఎంపికైన ‘కార్తికేయ 2’ డైరెక్టర్ చందు మొండేటి, హీరో నిఖిల్​ను రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా పొగిడేస్తున్నారు. నిఖిల్ అయితే త‌న సోష‌ల్ మీడియాలో ఫుల్ ఎమోష‌న‌ల్ అవుతూ పోస్ట్ పెట్టారు. ఇక ద‌ర్శ‌కుడు చందూ మొండేటి ఈ సంద‌ర్భంగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. నాగచైతన్యతో తీస్తున్న ‘తండేల్’ ఫినిష్ అయ్యాక.. ‘కార్తికేయ 3’ని ప్రారంభిస్తానని చెప్పుకొచ్చారు.