Niharika|సినిమాల‌లోకి రాకముందు నిహారిక ఏం చేసేది.. ఆమె తొలి జీతం ఎంతో తెలుసా?

Niharika| మెగా డాట‌ర్ నిహారిక ఇప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్ నుండి నిర్మాత‌గా మారిన నిహారిక తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టింది. ఆగస్టు 9 న నిహారిక నిర్మించిన క‌మిటీ కుర్రోళ్లు చిత్రం థియేటర్లలోకి వచ్చి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను దాటేసింది. లాభాల బాటలో పయని

  • By: sn    cinema    Aug 18, 2024 11:27 AM IST
Niharika|సినిమాల‌లోకి రాకముందు నిహారిక ఏం చేసేది.. ఆమె తొలి జీతం ఎంతో తెలుసా?

Niharika| మెగా డాట‌ర్ నిహారిక ఇప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్ నుండి నిర్మాత‌గా మారిన నిహారిక తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టింది. ఆగస్టు 9 న నిహారిక నిర్మించిన క‌మిటీ కుర్రోళ్లు చిత్రం థియేటర్లలోకి వచ్చి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను దాటేసింది. లాభాల బాటలో పయనిస్తుంది. ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి మొదలు మహేశ్ బాబు దాకా ప్రశంసల వర్షం కురిపించారు. కమిటీ కుర్రోళ్లు సినిమాలో ఏకంగా 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం. అలాగే సీనియర్ నటీనటులు కూడా మెరిశారు.ఈ సినిమాని జ‌నాల‌లోకి మ‌రింత‌గా తీసుకెళ్లేందుకు నిహారిక మ‌రింత‌గా కృషి చేస్తుంది. ప‌లు న‌గ‌రాల్లో పర్య‌టిస్తూ ఇంట‌ర్వ్యూలు కూడా ఇస్తుంది.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నిహారిక త‌న ప‌ర్స‌న‌ల్, ప్రొఫెన‌ల్ లైఫ్‌కి సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేసింది. నేను సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్ లోనే ఓ కేఫ్ లో పనిచేసాను. అక్కడ నాకు వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు అని నిహారిక చెప్పుకొచ్చింది. తన ఫ్యామిలీ తనను ఎక్కడికీ బయటకు పంపేవారు కాదని.. అందుకే ఫారెన్ లో చదవాలని ఉన్నా.. వెళ్లలేదని నిహారిక పేర్కొంది.. తన చదువు అంతా ఇక్కడే హైదరాబాద్ లో కంప్లీట్ చేశానన్నారు. గతంలో ఢీ డాన్స్ షో ద్వారా టెలివిజన్ లోకి మొదటిగా ఎంటర్ అయిన నిహారిక ఆ తరువాత ప‌లు షోలకి కూడా హోస్ట్‌గా చేసింది. అనంతరం ఒక మనసు సినిమాతో క‌థానాయిక‌గా మారింది.

సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన ఒక మ‌న‌సు సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు కాని.. నిహారిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వెబ్ సిరిస్ లతో పాటు.. నిర్మాతగా కూడా మారింది బ్యూటీ. ఇక నిహారిక పెళ్ళి తరువాత ఇండస్ట్రీకి దూరం అయిన విష‌యం తెలిసిందే. అయితే భర్తతో మనస్పర్ధల తరువాత విడాకులు తీసుకుంది. వివాహ బంధాన్ని తెంచుకుంది. చైతన్యతో విడాకులు తరువాత కొన్నాళ్లు అన్నింటికి బ్రేక్ ఇచ్చి కూల్‌గా ఉన్న ఈ మెగా డాట‌ర్ చిన్నగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తోంది. నిర్మాత‌గా తొలి హిట్ అందుకోవ‌డంతో ఇక నిహారిక జోరుకి బ్రేకులు ఉండ‌వేమో అని అంటున్నారు.