Samantha | ఎవరూ హాస్పటల్‌కు కూడా తీసుకువెళ్లలేదు: సమంత భావోద్వేగం

Memory loss) వచ్చినట్లై చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఆ సమయంలో తనను ఎవరూ ఆసుపత్రికి(Hospital) కూడా తీసుకువెళ్లలేదంటూ భావోద్వేగానికి గురైంది. మీరు ఎలా ఉన్నారు అని కనీసం ఎవరూ అడగలేదని, ఒక్కరు కూడా పలకరించలేదని వాపోయింది.

Samantha  | ఎవరూ హాస్పటల్‌కు కూడా తీసుకువెళ్లలేదు: సమంత భావోద్వేగం

Samantha | సమంత రూత్​ ప్రభు – ఏడాదిన్నర నుంచి ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ తెలుగులో స్టార్ హీరోయిన్ గా, నెంబర్ వన్ కథానాయికగా కొనసాగుతోంది ముద్దుగుమ్మ సమంత. ఇటీవలే ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది. మయోసైటిస్(Myositis) కు చికిత్స తీసుకోవడం కోసం సినిమాలకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమాలు చేయడానికి నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్​ను కూడా తిరిగిచ్చేసింది. చికిత్స తీసుకుంటూ దేశాలు చుట్టివచ్చింది. తాను ఏ సమయంలో ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా తన విషయాలన్నింటినీ సామాజిక మాధ్యమాలద్వారా అభిమానులతో పంచుకునేది.

భావోద్వేగానికి గురైన సమంత

హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన ‘సిటాడెల్’(Citadel) వెబ్ సిరీస్ ను హిందీలో రెండో సీజన్​గా హనీ బన్నీ(Honey Bunny) పేరుతో పునర్మించారు. ఈ నవంబర్​ 7న అమెజాన్​ ప్రైమ్​(Amazon Prime)లో విడుదల కానుంది. ఇందులో సమంత కథానాయికగా నటించింది. దీనికి సంబంధించి ప్రమోషన్స్​లో ప్రస్తుతం బిజీగా ఉంది.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా సామ్ భావోద్వేగాని(Emotional)కి లోనైంది. తనకు మయోసైటిస్(Myositis ) సోకినప్పుడు అదేంటో కూడా తెలియదని, దానికి చికిత్స ఎక్కడ దొరుకుతుందనే విషయం తెలియలేదని, ఒక్కసారిగా తాను గతం అంతా మర్చిపోయినట్లైందని, మతిమరపు(Memory loss) వచ్చినట్లై చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఆ సమయంలో తనను ఎవరూ ఆసుపత్రికి(Hospital) కూడా తీసుకువెళ్లలేదంటూ భావోద్వేగానికి గురైంది. మీరు ఎలా ఉన్నారు అని కనీసం ఎవరూ అడగలేదని, ఒక్కరు కూడా పలకరించలేదని వాపోయింది.

తాను ‘సిటాడెల్’ సెట్స్ పైకి వచ్చేవరకు నిర్మాత, దర్శకులు ఎదురుచూసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. తాను చేయను అన్నప్పటికీ వారు పట్టుబట్టి చేయించారని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన సొంత బ్యానర్ లో ‘మాఇంటి బంగారం’ పేరుతో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. హీరోగా ప్రియదర్శి నటిస్తున్నారు. తర్వాత ఓ వెబ్ సిరీస్ ఒప్పుకుంది. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్(Prashant Neel – NTR) లో రాబోతున్న చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించాలని కోరగా, సమంత ఇంకా ఏ నిర్ణయాన్నీ చెప్పలేదు. రామ్​చరణ్​–బుచ్చిబాబు కాంబినేషన్లో తయారవబోతున్న ఆర్​సీ16(RC16)లో కూడా నటించాల్సిందిగా కోరినట్లు వార్తలు వస్తున్నాయి.