NTR|బ‌య‌ట‌ప‌డిన ఎన్టీఆర్ గాయం.. బామ్మ‌ర్ధి కోసం రంగంలోకి దిగ‌క త‌ప్ప‌లేదు మరి..!

NTR| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అందిపుచ్చుకున్న విష‌యం తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న ఎన్టీ

  • By: sn    cinema    Aug 18, 2024 9:27 AM IST
NTR|బ‌య‌ట‌ప‌డిన ఎన్టీఆర్ గాయం.. బామ్మ‌ర్ధి కోసం రంగంలోకి దిగ‌క త‌ప్ప‌లేదు మరి..!

NTR| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అందిపుచ్చుకున్న విష‌యం తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా దేవర షూటింగ్ తుదిదశకు చేరుకోగా, ఈ మూవీని సెప్టెంబర్ 27న థియేట‌ర్స్‌లోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్‍లో హృతిక్ రోషన్‍తో కలిసి ‘వార్ 2’ మూవీని కూడా ఆయన చేస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తోనూ తదుపరి ఓ సినిమాకు రెడీ అయ్యారు. అయితే, ఈ తరుణంలో ఎన్టీఆర్ ఓ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరారనే రూమర్లు ఇటీవ‌ల ఎంత వైర‌ల్ అయ్యాయో మ‌నం చూశాం.

అభిమానులు ఆందోళ‌న చెందుతున్న స‌మయంలో టీం స్పందించింది. జిమ్‍లో వర్కౌట్స్ చేస్తుండగా.. ఎన్టీఆర్ ఎడమచేతి మణికట్టుకు స్వల్ప గాయమైనట్టు వెల్లడించింది. ఆయన చేతికి కట్టుకట్టినట్టు తెలిపింది. ఎన్టీఆర్‌కు స్వల్ప గాయమే అయిందని టీమ్ పేర్కొంది. ఆయన రెండు వారాల్లో పూర్తిగా కోలుకుంటారని, మళ్లీ వర్క్ మొదలుపెడతారని కూడా తెలియ‌జేయ‌డంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. రెండు వారాల్లో క‌ట్టుని పూర్తిగా తీసేసి త్వరలోనే మళ్లీ వర్క్‌కు వెళతారు అని ఎన్టీఆర్ ఆఫీస్ ఓ స్టేట్‍మెంట్ రిలీజ్ చేసింది. అలాగే, ఇందుకు సంబంధించి ఎలాంటి పుకార్లు వద్దని పేర్కొంది. అయితే గాయం త‌ర్వాత తొలిసారి చేతిక‌ట్టుతో బ‌య‌ట క‌నిపించారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘ఆయ్’. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ విలేజ్ ఎమోషనల్ డ్రామా ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రీసెంట్‌గా ఆయ్ టీమ్ ను యంగ్ టగర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. హీరో, హీరోయిన్లను ప్రత్యేకంగా అభినందించిన తారక్.. చిత్ర బృందం సభ్యులందరికీ కంగ్రాట్స్ చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.ఈ ఫోటోల‌లో ఎన్టీఆర్ చేతి క‌ట్టుతో క‌నిపించ‌డం గ‌మ‌న‌ర్హం.