NTR| పది ఊర్లకి కాపరిగా ఎన్టీఆర్..దేవర స్టోరీ మొత్తం అలా లీక్ చేశాడేంటి?
NTR| ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ దేవర. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్టోబర్ 10న చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేయగా, మూవీ నుండి ఒక్కో సాంగ్ విడుదల చేస్తూ మూవీపై అంచనాలు పెంచే ప్ర

NTR| ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ దేవర. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్టోబర్ 10న చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేయగా, మూవీ నుండి ఒక్కో సాంగ్ విడుదల చేస్తూ మూవీపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. . మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సాంగ్ సోసోగా ఉందని చెప్పేశారు. దేవర ఫియర్ సాంగ్ 24 గంటల్లో కేవలం 5.19 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోగా, జూనియర్ కెరియర్ లోనే 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. కాకపోతే ఓవరాల్ గా టాప్ 10లో ఈ పాటకి స్థానం దక్కలేదు.
భారీ యాక్షన్ సీన్స్ తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నారు కొరటాల. ఇక ఈ సినిమాకి సంబంధించి బయటకు వస్తున్న అప్‌డేట్స్ నందమూరి అభిమానులకి పిచ్చెక్కిపోయేలా చేస్తుంది. తాజాగా ఈ సినిమాలో రౌడీల్లో ఒకరిగా నటించిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ దేవర సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్తూ కథ కూడా రివీల్ చేశాడు. ఎన్టీఆర్ సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఉంటాడని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా తను ముందుండి చూసుకుంటాడని చెప్పుకొచ్చాడు. సముద్రం దగ్గర ఫైట్ సీన్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని తెలియజేశాడు. ఏకంగా పదివేల మందితో అందరిని నరికే సీన్ అదిరిపోతుంది.
సముద్రం అంతా రక్తంతో నిండిపోవడం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. యాక్షన్ సీన్స్ ని మేము లైవ్ లో చూసి షాక్ అయ్యాం. ఎన్టీఆర్ నటన చూసి ఆశ్చర్యపోయాం. ఆయన సింగిల్ టేక్‌లో డైలాగులు చెప్పేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ బట్టలు చించుకోవడం ఖాయం అంటూ స్టన్నింగ్స్ కామెంట్స్ చేసి సినిమాపై మరింత హైప్ పెంచాడు. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ సంగతులు చెప్పి అంచనాలు పెంచేసింది జాన్వీ కపూర్. దేవర చిత్రంలో తనకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పిన జాన్వీ.. షూటింగ్ అంతా సరదాగా సాగినట్టు పేర్కొంది. మూవీ చాలా విభిన్నమైన కథతో రూపొందుతుందని ఆడియన్స్‌కి గతంలో ఎన్నడూ లేనంత ఫీలింగ్ ఈ మూవీ అందిస్తుందని తెలియజేసింది.