NTR31|ఎన్టీఆర్- ప్ర‌శాంత్ నీల్ మూవీకి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌.. రిలీజ్ డేట్ కూడా వ‌చ్చేసింది..!

NTR31| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మంచి స్పీడు మీదున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత జోరు పెంచిన ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్‌లో మూవీని విడుద‌ల చేసే ప్లాన్ చేస్తున్నారు. మ‌రోవైపు బాలీవుడ్ డె

  • By: sn    cinema    Aug 10, 2024 7:40 PM IST
NTR31|ఎన్టీఆర్- ప్ర‌శాంత్ నీల్ మూవీకి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌.. రిలీజ్ డేట్ కూడా వ‌చ్చేసింది..!

NTR31| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మంచి స్పీడు మీదున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత జోరు పెంచిన ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్‌లో మూవీని విడుద‌ల చేసే ప్లాన్ చేస్తున్నారు. మ‌రోవైపు బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ వార్ 2లో న‌టిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ఆ త‌ర్వాత త‌న 31వ సినిమాగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు ఎన్టీఆర్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించాడు జూనియర్.

అయితే అనౌన్స్‌మెంట్ ఎప్పుడో వచ్చినా చిత్ర షూటింగ్ ఇంకా ప్రారంభం కాక‌పోవ‌డంతో అస‌లు ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే అనుమానాలు అంద‌రిలో త‌లెత్తాయి. ఈ క్ర‌మంలో ఆగ‌స్ట్ 9న హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ ఫ్యామిలీ, కల్యాణ్ రామ్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. అయితే చాలా నిరాడంబ‌రంగా మూవీ పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌గా, ఆ త‌ర్వాత రిలీజ్ డేట్‌ని సైతం ప్ర‌క‌టించి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

మూవీని 2026 జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన కూడా మూవీ టైటిల్‌పై క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం మూవీకి డ్రాగ‌న్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక ఈ చిత్రంలో ర‌ష్మిక‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేశార‌ని అంటున్నారు. ఇక ఈ ఏడాదిలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంద‌ని అంటున్నారు. రానున్న రోజుల‌లో మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయి.