OG haiku meaning | OG సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన “వాషి యో వాషి” జపనీస్ హైకూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ హైకూ కేవలం ఒక పాట కాదు, సినిమాలోని ప్రధాన కథాంశాన్ని సూచిస్తోంది. ఇక సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, యూనిట్ ఈ హైకూను విడుదల చేసి మరింత ఉత్కంఠను రేపింది. పవన్ తన స్టైల్లో “ఓమీ… మై డియర్ ఓమీ” అంటూ ఈ హైకూను మొదలుపెట్టి, తర్వాత జపనీస్ పంక్తులు పలకడం అభిమానుల్లో కుతూహలం రేకెత్తించింది. అసలేంటీ ఈ వ్యాక్యాల అర్థమని తెగ వెతుకుతున్నారు.
ఈ హైకూలో ఒక అడవి గద్దను (wild eagle) ఎలా వేటాడాలో జపనీయులు వివరించారు. ముందుగా దాని రెక్కలను తెంపాలి, కళ్లను తీయాలి, కాళ్లను కోయాలి, చివరగా దాని కరడుగట్టిన గుండెను పెకలించాలి. అంటే ఒక శక్తివంతమైన శత్రువును ఎలా క్రమంగా బలహీనపరచి చివరికి ఓడించాలో చెప్పే కవిత ఇది.
ఈ లైన్స్ ద్వారా హీరో ఓజస్ (పవన్ కళ్యాణ్) తన శత్రువును, ముఖ్యంగా ఓమీ (ఇమ్రాన్ హష్మీ)ని, ఎలా ఓడించాలో తనకే ఫోన్లో చెప్తాడు.
鷲よ鷲
野生の鷲を殺すには
まず翼を切り落とす必要がある
地面に落ちたら…目をえぐり出す
目が見えなくなり
どこに行けばいいのかわからなくなる
そこで足を切って動けなくする
そして、野生の心臓をえぐり出すのだ
鷲よ鷲
వాషి యో వాషి
యసే నో వాషి ఓ కొరోసు నివా
మజు త్సుబాసా ఓ కిరి ఒతోసు హిట్సుయో గ ఆరు
జిమెన్ ని ఒచితారా… మె ఓ ఎగురి దాసు
మె గా మియెనాకు నారి
దోకొ ని ఇకేబా ఇఇ నో క వకారణాకు సురు
సోకొదే అషి ఓ కిట్టే ఉగోకేనాకు సురు
సోషితే, యసే నో షింజో ఓ ఎగురి దాసు నోడా
వాషి యో వాషి
గద్దా… ఓ గద్దా!
అడవి గద్దను చంపాలంటే,
మొదట దాని రెక్కలను తెంపాలి.
కింద పడగానే దాని కనుగుడ్లను పీకేయాలి.
గుడ్డిదైన గద్ద, ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంలో పడుతుంది.
ఆ తర్వాత దాని కాళ్లను తెగ్గోస్తే అది ఇక ఎక్కడికీ కదలదు
అప్పుడు.. అప్పుడు… దాని కరకు గుండెను పెకలించాలి.
ఓ గద్దా… ఓ గద్దా!
ఓమీ పాత్రను ఒక అడవి గద్దలా చూపిస్తూ, హీరో అతడి శక్తులను ఒక్కొక్కటిగా నాశనం చేస్తూ, చివరికి ఓమీని ఎలా ఓటమి పాలు చేయబోతున్నాడని ఈ హైకూ అన్యాపదేశంగా చెబుతోంది. “నీలాంటి వాడిని నేలకేసి ఎలా దించాలో నాకు తెలుసు” అనే పవన్ డైలాగ్‌కి ఈ హైకూ బ్యాక్‌డ్రాప్ ఇవ్వడం, OG కథలో కీలక మలుపు కానుందని సూచిస్తోంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా మోహన్ కన్మణి పాత్రలో నటించగా, విలన్‌గా ఇమ్రాన్ హష్మీ కనిపించబోతున్నారు. అలాగే ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీతం థమన్ అందించగా, DVV ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై DVV దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు.