Kantara Chapter-1 Trailer : గుస్ బంప్స్ తెప్పిస్తున్న ‘కాంతార’ ట్రైలర్

‘కాంతారచాప్టర్ 1’ ట్రైలర్ గూస్ బంప్స్ ఇస్తున్నది. రిషబ్ శెట్టి, బర్మె, పుంజుర్లి అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది.

Kantara Chapter-1 Trailer : గుస్ బంప్స్ తెప్పిస్తున్న ‘కాంతార’ ట్రైలర్

విధాత : కన్నడ స్టార్ రిషిబ్ శెట్టి స్వీయా దర్శకత్వంలో 2022లో వచ్చిన ‘కాంతార’ సాధించిన ఘన విజయంతో..దీనికి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్‌ 1’ ఆక్టోబర్ 2న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా సోమవారం ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ అంచనాలకు తగ్గట్లుగానే అద్భతమైన..ఆసక్తికరమైన విజువల్ వండర్ గా మెప్పించింది. నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు అంటూ తన తండ్రి ‘పుంజుర్లి’ అవతారంలో మాయమైన చోటుకు వచ్చిన కొడుకు ప్రశ్నతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ ప్రశ్నకు ‘ఇదే మన మూలం శివ.. మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే అదో పెద్ద దంత కథ.’ అంటూ గతంలోకి తీసుకెళ్లిన సన్నివేశంతో సినిమా మరో రేంజ్ కు వెళ్లిపోయింది. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్ లోని సన్నివేశాల్లో రిషబ్ లుక్, పుంజుర్లి అవతారం ఎలివేషన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తుంది..భారీ సెట్టింగ్ లు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, విజువల్స్‌ హైలైట్ గా నిలిచాయి.

ట్రైలర్ లో పులి కాపలాగా దైవాంశతో అడవి తెగకు దొరికిన బిడ్డ… ‘బెర్మె’ అంటూ ముద్దుగా పేరు పెట్టుకుని పెంచుకుంటారు. తెగ ప్రజలు అడవిలో పండించిన..సేకరించిన పంటలకు కప్పం కట్టాలంటూ హింసించే రాజుకు ‘బెర్మె’ ఎదురు తిరిగి ఎలా నిలిచాడు ? యువరాణి తెగ నాయకుడైన బెర్మెను ఇష్టపడడంతో రాజు ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు? తెగకు.. రాజుకు మధ్య జరిగే యుద్ధానికి, ‘కాంతార’కు సంబంధం ఏంటి? అసలు పుంజుర్లి దేవుని చరిత్ర ఏంటి? గుళిగ కథ ఏంటి? అనే అంశాల చుట్టు సినిమా కథ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. రిషబ్‌ తన నటనతో ఆకట్టుకోగా.. రుక్మిణి వసంత్‌ మహారాణి పాత్రలో కనిపించారు.