విధాత : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమా గురువారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ సినిమాగా వచ్చిన ఓజీ పవన్ మార్క్ సినిమాగా ఆయన అభిమానులను అలరిస్తుండటంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఓజీ టీ షర్టులు ధరించి మరి సినినా థియేటర్ల వద్ధ సందడి చేస్తున్నారు.
అయితే బెంగళూరులోని కేఆర్ పురంలో ఓజీ సినిమా చూసేందుకు థియేటర్ కి వచ్చిన అభిమానుల ఓవర్ యాక్షన్ వివాదస్పదమైంది. కత్తితో థియేటర్ లోకి వచ్చిన పవన్ అభిమానులు సినిమా ప్రదర్శితమవుతున్న సమయంలో రెచ్చపోయి స్క్రీన్ ని చింపేశారు. ఈ ఆకస్మిక పరిణామంతో థియేటర్ యాజమాన్యం షో నిలిపివేసింది. ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. పవన్ అభిమానుల అతిచేష్టలతో సినిమా ప్రదర్శన ఆగిపోవడంతో ప్రేక్షకులు తీవ్ర అసహనంతో వెనుతిరిగారు.