‘Chikiri Chikiri’ Song Record | పెద్ది ‘చికిరి చికిరి’ పాట.. 24 గంటల్లోనే రికార్డులు గిర్రున తిరిగి బద్దలయ్యాయి.!
రామ్‌చరణ్ ‘పెద్ది’ నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ‘చికిరి చికిరి’ పాట 24 గంటల్లోనే 46 మిలియన్ వ్యూస్‌తో ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. చరణ్ బీడీ స్టెప్, జాన్వీ లుక్, రెహమాన్ మ్యూజిక్ మంత్రం – అభిమానుల్లో వైరల్ ఫీవర్ రేపింది.
Ram Charan’s “Chikiri Chikiri” from Peddi Creates History — Most-Viewed Indian Song in 24 Hours!
(విధాత వినోదం డెస్క్)
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ – బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్–ఇండియన్ సినిమా ‘పెద్ది’ నుంచి వచ్చిన తొలి సింగిల్ ‘చికిరి చికిరి’ ఇప్పుడు అక్షరాలా రికార్డులు సృష్టిస్తోంది. నవంబర్ 7న విడుదలైన ఈ పాట కేవలం 24 గంటల్లోనే 4.6 కోట్ల వ్యూస్ సాధించి, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వీక్షించబడిన పాటగా నిలిచింది.
ఇదే పాట 13 గంటల్లోనే 3.2 కోట్ల వ్యూస్, దాదాపు 10 లక్షల లైక్స్ సాధించడం ప్రత్యేకత. ఏఆర్ రెహమాన్ సంగీతం, మోహిత్ చౌహాన్ గాత్రం, బాలాజీ సాహిత్యం — ఈ ముగ్గురి మంత్రముగ్ధ కలయిక అభిమానుల హృదయాలను దోచుకుంది.
పెద్ది: రామ్‌చరణ్ బీడీ స్టెప్, జాన్వీ లుక్ – మాస్ అండ్ క్లాస్ కలయిక!

‘చికిరి చికిరి’ పాటలో రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో మంచిఊపు తెచ్చాయి. ఆయన వేసిన బీడీ హుక్ స్టెప్ వైరల్‌గా మారి, అభిమానుల్లో పండగ వాతావరణం సృష్టిస్తోంది. జాన్వీ కపూర్ సోయగాలు, రూరల్ కాస్ట్యూమ్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వైబ్ — ఈ పాటను ఒకే సారి పెద్ద విజువల్ ఫీస్ట్‌గా మార్చేశాయి.
డ్యాన్స్ మాస్టర్ జానీ కొరియోగ్రఫీ, రత్నవేలు విజువల్స్, నేచురల్ లొకేషన్లలో షూటింగ్ – ఏఐ లేదా వీఎఫ్ఎక్స్ లేకుండా రియల్ టచ్ కలగలిపి పెద్ది పాటకు నిజమైన సౌందర్యాన్ని తీసుకొచ్చాయి.
‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో టాప్ చార్ట్స్‌లో నంబర్ వన్‌గా నిలిచింది. దాంతో పెద్ది, ‘జవాన్ (జిందా బందా..)’ మరియు ‘పుష్ప 2(కిస్సిక్..)’ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ పాటే “Most Viewed Indian Song in 24 Hours” అనే టైటిల్‌ను సాధించింది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌తో పాటు జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేంద్రు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘పెద్ది’, ఈ రికార్డ్ సాంగ్‌తోనే ఇప్పటికే పాన్–ఇండియా సెన్సేషన్‌గా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram