Prabhas| క‌న్న‌ప్ప సెట్‌లో అడుగుపెట్టిన ప్ర‌భాస్.. విష్ణు ఇచ్చిన అప్‌డేట్‌కి ఫ్యాన్స్ ఖుష్‌

Prabhas| ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలిగిపోతున్నారు ప్ర‌భాస్. అత‌ని క్రేజ్ రోజురోజుకి మ‌రింత పెరుగుతూ పోతుంది. ఇండియా హీరోగా, దేశంలోనే నెంబర్ వన్ హీరోల‌లో ఒకరిగా చెలామణి అవుతున్న ప్ర‌భాస్ చివ‌రిగా స‌లార్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఈ మూవీ అందించిన స‌క్సెస్‌తో ఇప్పుడు

  • By: sn    cinema    May 09, 2024 4:50 PM IST
Prabhas| క‌న్న‌ప్ప సెట్‌లో అడుగుపెట్టిన ప్ర‌భాస్.. విష్ణు ఇచ్చిన అప్‌డేట్‌కి ఫ్యాన్స్ ఖుష్‌

Prabhas| ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలిగిపోతున్నారు ప్ర‌భాస్. అత‌ని క్రేజ్ రోజురోజుకి మ‌రింత పెరుగుతూ పోతుంది. ఇండియా హీరోగా, దేశంలోనే నెంబర్ వన్ హీరోల‌లో ఒకరిగా చెలామణి అవుతున్న ప్ర‌భాస్ చివ‌రిగా స‌లార్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఈ మూవీ అందించిన స‌క్సెస్‌తో ఇప్పుడు కల్కి, రాజాసాబ్ చిత్రాలు చేస్తున్నాడు. ఈ సినిమాల కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఇక ఈ మూవీల తర్వాత స్పిరిట్, సలార్ 2 చిత్రాల్లో నటించాల్సి ఉంది. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో కూడా ప్ర‌భాస్ ఒక మూవీ చేయ‌నున్నాడు. అలానే క‌న్న‌ప్ప చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు ప్ర‌భాస్.

మోహన్ బాబు నిర్మాతగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో, స్టార్ కాస్ట్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా క‌న్న‌ప్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచు విష్ణు ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, స‌పోర్టింగ్ రోల్స్‌లో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, నయనతార, మధుబాల.. లాంటి స్టార్స్ నటిస్తున్నారు. న్యూజిలాండ్‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో జ‌రుపుకుంటుంది.ఇక ఒక్కో హీరో కూడా త‌మ పార్ట పూర్తి చేసుకుంటున్నారు. రీసెంట్‌గా అక్ష‌య్ కుమార్ త‌న పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌లో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ జాయిన్ అయ్యాఉ.

ఓ పక్క రాజా సాబ్, మ‌రో ప‌క్క క‌ల్కి సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్ వాటికి కాస్త గ్యాప్ ఇచ్చి కన్నప్ప షూటింగ్ లో జాయిన్ అయ్యాడు .. దీని గురించి విష్ణు మంచు అధికారికంగా ప్రకటించారు. విష్ణు తన సోషల్ మీడియాలో ప్రభాస్ కాలు అడుగుపెడుతున్నట్టు ఉన్న ఓ పోస్టర్ ని షేర్ చేస్తూ.. నా బ్రదర్ షూట్ లో జాయిన్ అయ్యాడు అని తెలియ‌జేశాడు. ప్ర‌భాస్ నాన్ స్టాప్ షూటింగ్ మొదలు పెట్ట‌నున్నాడ‌ని, సింగిల్ షెడ్యూల్‌లో క‌న్న‌ప్ప షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత మిగతా సినిమాల షూటింగ్ పూర్తి చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. అయితే క‌న్న‌ప్ప‌లో ప్రభాస్ ఏ పాత్రలో నటిస్తున్నారో అధికారికంగా చెప్పలేదు కానీ శివుడి పాత్రలో కనిపించ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.