The Raja Saab | జవవరి 9న రాజాసాబ్ విడుదల : నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడి
రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీ జనవరి 9న విడుదల, మేకర్స్ కొత్త వీఎఫ్ఎక్స్ కోసం ఆలస్యం చేశారు.
The Raja Saab | విధాత : రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి(Director Maruthi) కాంబినేషన్ లో వస్తున్న ‘ది రాజాసాబ్'(The Raja Saab) విడుదల తేదీపై ఎట్టకేలకు చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. రొమాంటిక్ హారర్ కామెడీగా వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేస్తుమన్న చిత్ర బృందం..పోస్టు ప్రొడక్షన్ పనుల ఆలస్యంతో డిసెంబర్ 5వ తేదీన వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేస్తున్నట్లుగా మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్వయంగా ప్రకటించారు. ‘మిరాయ్'(Mirai) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత విశ్వప్రసాద్ ‘(TG Vishwa Prasad)ది రాజాసాబ్’ విడుదలపై కొత్త తేదీని వెల్లడించడం విశేషం.
పాన్ ఇండియా సినిమా ‘ది రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై క్వాలిటీ వీఎఫ్‌ఎక్స్(VFX) అందించడానికి భారీగా ఖర్చు చేస్తుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటమే ఈ సినిమా విడుదల ఆలస్యానికి కారణమని తెలుస్తుంది. విడుదలకు ఇంకా నాలుగు నెలలకు పైగానే సమయం ఉన్నందునా బెస్ట్ విజువల్ ఎఫెక్స్ట్ అందించేందుకు మేకర్స్ కు కావాల్సినంత సమయం దొరికినట్లయ్యింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram