Akhanda 2 : బాలయ్య అఖండ-2 సినిమా వాయిదా !

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అఖండ-2 సినిమా వాయిదా, VFX కారణంగా కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తారు.

Akhanda 2 : బాలయ్య అఖండ-2 సినిమా వాయిదా !

Akhanda 2 | విధాత, హైదరాబాద్ : బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ-2 సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర బృందం అధికార ప్రకటనలో తెలిపింది. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలకు అధిక సమయం పడుతుండటంతో విడుదల వాయిదా వేసినట్టు వెల్లడించారు. గతంలో అఖండ-2 ను దసరా సందర్భంగా
సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా విడుదలకు సంబంధించి కొత్త తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతుండటం..ముందుగా అనుకున్న విడుదల తేదీకి నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో సినిమా వాయిదా వేయడమే మంచిదన్న నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. లేదంటే ఇటీవల గ్రాఫిక్స్ సరిగా లేక ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన హరిహర వీరమల్లు, వార్ 2 సినిమాల తరహాలో విమర్శలు ఎదుర్కొంటామన్న భయం కూడా అఖండ 2 మేకర్స్ ను భయపెట్టి ఉంటుందని టాక్. వీఎఫ్ఎక్స్ సంతృప్తి కరంగా లేకపోవడంతో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సినిమా విశ్వంభర సినిమా కూడా వచ్చే సమ్మర్ కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అదే బాటలో అఖండ 2 కూడా చేరిపోయింది.

బాలయ్య-బోయపాటిల కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజండ్, అఖండ చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా అఖండ సినిమా బాలయ్య కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచింది. తమన్ బీజీఎంకు, బాలయ్య యాక్టింగ్ కు థియేటర్లు ప్రేక్షకులు ఊగిపోయారు. అలాంటి హిట్ సినిమా అఖండకు సిక్వెల్ గా వస్తున్న అఖండ 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ మధ్య వచ్చిన టీజర్ కు కూడా భారీ స్పందన లభించింది. ఈ సినిమా షూటింగ్ ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళలో లక్షలాది భక్తుల మధ్య, అలాగే హిమాలయాల పాటు జార్జియా దేశంలోనూ చిత్రీకరించారు. మారిన తేదీ మేరకు అఖండ 2 కూడా అఖండ మాదిరిగానే డిసెంబర్ లో విడుదల కావచ్చని తెలుస్తుంది. డిసెంబర్ లో విడుదల కావాల్సిన ప్రభాస్-మారుతి రాజాసాబ్ సినిమా కూడా జనవరి9కి వాయిదా పడటం కూడా ఆఖండ 2 కు కలిసివస్తుందనుకుంటున్నారు.

Akhanda 2