విధాత : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ మూవీ రాజాసాబ్(Raja Saab) సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ 2(Salaar) , హను రాఘవపూడి ఫౌజీ(Fauji) సినిమాలతో బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ వార్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఫౌజీ చిత్రంలో ప్రభాస్ బ్రిటీష్ ఆర్మీ సైనికుడిగా కనిపించనున్నాడని టాక్. వాటి షూటింగ్ పూర్తయ్యక కల్కీ 2898 ఏడీ పార్ట్ 2(Kalki 2898 AD Part-2) మూవీ షూటింగ్ లో చేరిపోతాడు. ఈ మధ్యలో ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంతో ప్రభాస్ సినిమా షూటింగ్ కు సిద్దమవ్వడం అభిమానుల్లో ఆసక్తి రేపింది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నాడు. ఈ గ్యాప్ లో ప్రభాస్ సినిమాకు సంబంధించిన ప్రీ విజువలైజేషన్ వర్క్ పూర్తి చేశాడని టాక్. ప్రతీ క్యారెక్టర్, ప్రతీ సీన్, ప్రతీ షాట్.. పిన్ టూ పిక్ ముందే ప్రీ విజువలైజేషన్ లో డిజైన్ చేసుకున్నాడని..అది చూస్తూ మూవీ షూటింగ్ చేసేయొచ్చని..అంత క్లారిటీగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ‘బ్రహ్మరాక్షస్'(Brahmarakshas) అనేది వర్కింగ్ టైటిల్ ఉందని..అయితే టైటిల్ మారే అవకాశాలూ ఉన్నాయని కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ‘హను- మాన్’ సీక్వెల్ ‘జై హను- మాన్’ను(Jai Hanuman) తెరకెక్కిస్తున్నారు. సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది రెండో భారీ చిత్రం. ‘కాంతార'(Kantara) ఫేం రిషబ్ శెట్టి హనుమంతుడిగా కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.