Prabhas| సంపాదించిన కోట్ల డబ్బుని ప్రభాస్ ఏం చేస్తున్నాడు.. ఇన్నాళ్లకి బయటపడ్డ నిజం!
Prabhas| కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా స్టార్ హీరో

Prabhas| కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మారిన ప్రభాస్ ఇప్పుడు దేశంలోనే అగ్ర కథనాయకుడిగా చెలామణి అవుతున్నాడు. అంతటి ఇమేజ్ ను ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి డిజాస్టర్స్ ప్రబాస్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. సలార్, కల్కి చిత్రాలతో మళ్లీ ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగింది. ప్రభాస్ మార్కెట్ పరిధి విస్తరించింది. ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది. సినిమాకు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడని టాక్.
అయితే ప్రభాస్‌కి ఇంకా పెళ్లి కాలేదు. స్టిల్ బ్యాచిలర్. మరి అన్ని కోట్లు ప్రభాస్ ఏం చేస్తున్నాడు. ఐదారు సంవత్సరాల్లో ప్రభాస్ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. సంపాదించిన డబ్బును డార్లింగ్ ఏం చేస్తున్నాడని ముచ్చటించుకుంటున్న సమయంలో ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. తాను సంపాదించిన డబ్బును స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతున్నాడట. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ ఇల్లు ఉండగా, అది కాకుండా నగర శివారులో ఓ ఫామ్ హస్ నిర్మించుకున్నాడు. ఇప్పుడు మరో ఫామ్ హౌజ్ కూడా నిర్మిస్తున్నట్టు సమాచారం. రీసెంట్ గా ఇటలీలో ఓ ఖరీదైన బంగ్లా కొన్నాడని అంటున్నారు.
ఇక ముంబైలోనూ కొన్ని ఫ్లాటులు కొనుగోలు చేశాడని వినికిడి. రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాడంటున్నారు. ఇలా తను సంపాదించిన డబ్బుని ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇక కుటుంబ సభ్యుల కోసం, స్నేహితుల కోసం భారీగా ఖర్చు చేస్తుంటాడు ప్రభాస్ . అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపడుతుంటాడు. ఈ విషయాలను మాత్రం ఏనాడూ బయటకు రానివ్వలేదు. షూటింగ్ జరుగుతున్న సమయంలో యూనిట్ సిబ్బందికి తన ఇంటినుంచే భోజనాలు తెప్పిస్తుంటాడు ప్రభాస్. ఇక ప్రభాస్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ చేస్తున్నాడు. ఇదే గాక సీతారామందర్శకుడు హను రాఘవపూడితో కూడా మూవీ చేస్తున్నాడు.