Mamitha Baiju | మమితా బైజు పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్నది. ఈ సినిమాతోనే మమితా సంచలనంగా నిలిచింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్ట్ హిట్ అందుకోవడంతో క్రేజీ హీరోయిన్గా మారింది.
Mamitha Baiju | మమితా బైజు పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్నది. ఈ సినిమాతోనే మమితా సంచలనంగా నిలిచింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్ట్ హిట్ అందుకోవడంతో క్రేజీ హీరోయిన్గా మారింది. అంతకు ముదు చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వచ్చింది. మలయాళీ ప్రేమలతో హీరోయిన్గా పరిచయమైంది. అక్కడ సెస్సేషన్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై.. మంచి సక్సెస్‌ని అందుకున్నది. తెలుగు, తమిళంలోనూ మమిత బైజుకి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో మంచి సక్సెస్ అందుకున్న మూవీల్లో లవ్ టుడే ఒకటి. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత తెలుగులోనూ విడుదలైంది.
ఈ మూవీతో తెలుగువారికి పరిచయమయ్యారు నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్, ఆయన తమిళ దర్శకురాలు సుధా కొంగర దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ కీర్తిశ్వరన్తో సంయుక్తంగా ఓ ప్రాజెక్టును చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్గా మమితా బైజును ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. కాగా, ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మోల్కత్ నిర్మిస్తున్నారని టాక్. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మమితా బైజుకి ఇది తమిళంలో రెండో చిత్రం కావడం విశేషం. జీవీ ప్రకాశ్ హీరోగా వచ్చిన ‘రెబల్’ మూవీలోని మమిత హీరోయిన్గా నటించింది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును దక్కించుకున్నది. మరి ఈ చిత్రం యంగ్ బ్యూటీకి కలిసి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.