Priyanka Achar: ప్రియాంక ఆచార్ కు ‘ఏలుమలై’ కలిసొచ్చేనా..!
ప్రియాంక ఆచర్ టాలీవుడ్ డెబ్యూ ‘ఏలుమలై’ ఈ నెల 5న విడుదల; జగపతి బాబు, రాన్నా ముఖ్య పాత్రల్లో, సాంగ్‌లు యూట్యూబ్‌లో హిట్.

విధాత : తెల్ల చీరలో సిగ్గులొలుకు నవ్వులతో కనువిందు చేస్తున్న కన్నడ భామ ప్రియాంక ఆచార్(Priyanka Achar) టాలీవుడ్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. కన్నడంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికి తెలుగులో సరైన ఆఫర్ల కోసం అమ్మడు ఆరాటపడుతుంది. తాజాగా హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా(Raanna) హీరోగా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు(Jagapathi Babu) ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘ఏలుమలై’(Elumalai) ఈ నెల 5న విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమాకి రచన, మాటలు, దర్శకత్వం పునీత్ రంగస్వామి(Punit Rangaswamy). ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే టాలీవుడ్ లో(Tollywood) ఛాన్స్ లు కొట్టేయవచ్చని ప్రియాంక ఆచార్ ఎదురుచూస్తుంది.
నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఏలుమలై’ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ‘కాపాడు దేవా’(Kaapaadu Deva) అనే పాటను కాసర్ల శ్యామ్(Kasarla Shyam) రాయగా, డి. ఇమ్మాన్(D. Imman) బాణీ సంగీత దర్శకత్వంలో సింగర్ మంగ్లీ ఆలపించారు. ఇప్పటికే సిధ్ శ్రీరామ్(Sid Sriram) ఆలపించిన ‘రా చిలకా’(Raa Chilaka) అనే పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అయింది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.