Priyanka Chopra Birthday Vacation | మాల్ధీవులలో రెచ్చిపోయిన ప్రియాంకా చోప్రా జంట

Priyanka Chopra Birthday Vacation | మాల్ధీవులలో రెచ్చిపోయిన ప్రియాంకా చోప్రా జంట

Priyanka Chopra Birthday Vacation | విధాత : ప్రముఖ నటి గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా-నిక్ జోనాస్ జంట మాల్ధీవుల వెకేషన్స్ లో ఫుల్ గా చిల్ అయ్యారు. తన 43వ బర్త్ డే సందర్భంగా భర్త నిక్ జోనస్ తో కలిసి మాల్ధీవులలో ముద్దుముచ్చటలతో రెచ్చిపోయిన ప్రియాంకా చోప్రా తన మాల్ధీవుల వెకేషన్ కు సంబంధించి తాజాగా వెల్లడైన మరిన్ని ఫోటోలతో కుర్రకారులో హీట్ పెంచారు. భర్త నిక్ జోనాస్ ఈ ఫోటోలను షేర్ చేశారు. బీచ్ లో పొట్టి బట్టలతో, స్విమ్ సూట్ లో ప్రియాంకా చోప్రా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బీచ్ ఒడ్డున భర్త తన కోసం ఏర్పాటు చేసిన పుట్టిన రోజు ఏర్పాట్లకు ఫిదా అయినా ప్రియాంక చోప్రా ఆనందం పట్టలేక పరుగెత్తికెళ్లి భర్త నిక్ జోనాస్ పై దూకేసి లిప్ కిస్ లతో తన ప్రేమను చాటుకున్న సంగతి తెలిసిందే.

అదే వేడుకలలో బీచ్ లో భర్త, కూతురుతో ప్రియాంక ఎంజాయ్ మెంట్ ఫోటోలు మరింత రోమాంటిక్ గా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రియాంకా చోప్రా తెలుగులో ప్రస్తుతం రాజమౌళీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ఎస్ఎస్ఎంబీ 29లో నటిస్తోంది. అలాటే హాలీవుడ్ లో ప్రియాంక ‘ది బ్లఫ్’లో 19వ శతాబ్దపు కరేబియన్ సముద్రపు దొంగగా కూడా కనిపించనుంది. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ రెండవ సీజన్ కూడా నటించబోతున్న సంగతి తెలిసిందే.