Bala Krishna| కండోమ్స్ ఎలా వాడాలో అమ్మాయిల‌కి చెబుతున్న బాల‌య్య హీరోయిన్

Bala Krishna|  బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ఎంత బోల్డ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె మాట్లాడే మాట‌లు చేసే పనులు అన్ని కూడా బోల్డ్‌గానే ఉంటాయి. ఇక వివాదాల‌లో ఎక్కువ‌గా నిలుస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. రక్త చరిత్ర సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయిన ఈ చిన్న‌ది ఆ తరువా

  • Publish Date - May 23, 2024 / 09:44 AM IST

Bala Krishna|  బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ఎంత బోల్డ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె మాట్లాడే మాట‌లు చేసే పనులు అన్ని కూడా బోల్డ్‌గానే ఉంటాయి. ఇక వివాదాల‌లో ఎక్కువ‌గా నిలుస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. రక్త చరిత్ర సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయిన ఈ చిన్న‌ది ఆ తరువాత బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా తరువాత తెలుగులో రాధికా కనిపించింది లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లోనే ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ‌ అమ్మాయిలు ఎలాంటి కండోమ్ వాడాలో టిప్స్ అందిస్తూ ఓ వీడియో విడుద‌ల చేయ‌గా, ఇది నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది.

ప్ర‌ముఖ కంపెనీకి సంబంధించిన ప్ర‌మోష‌న్‌లో భాగంగా కండోమ్ గురించి రాధిక ప‌లు కామెంట్స్ చేసింది. కండోమ్స్ పేరు ఈ స‌మాజంలో ప‌ల‌క‌డానికి ఇబ్బందిగా ఫీల‌వుతుంటారు. ఈ జనరేషన్ లో ఇలాంటివి తెలుసుకోకపోతే మ‌నం చాలా సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. కండోమ్స్ ఎప్పుడు మన పార్ట్‌నర్స్ ఛాయిస్‌కు వదిలేస్తున్నాం ఎందుకు? ఈ నిర్ణయంలో మన మాటకు పట్టింపు ఉండదా? మన సుఖం వదిలి బాధను భరిస్తూ కండోమ్స్‌ను ఎందుకు భరించాలి. కండోమ్స్ విషయంలో మ‌నం సొంత నిర్ణ‌యం ఎందుకు తీసుకోకూడ‌దు. ఏ కండోమ్స్ మ‌న‌కు ఆనందంతో పాటు కంఫ‌ర్ట్‌గా ఉంటుంద‌నేది తెలుసుకుందాం. ఎపిక్ కండోమ్స్ మీకు చాలా కంఫ‌ర్ట్‌గా ఉంటుంది. ఎవ‌రో ఏదో అనుకుంటార‌ని మీరు ఆలోచించ‌వ‌ద్దు.

మీ కండోమ్స్ మీరే కొనుక్కోండి అంటూ రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది.కండోమ్స్ నిషిద్దమా అనే ట్యాగ్ లైన్ తో ఆమె.. అమ్మాయిలు కండోమ్స్ ఎలా వాడాలో చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారిన ఈ వీడియో అమ్మాయిల‌ని ఆలోజింప‌జేస్తుంది. ఇక రాధికా ఆప్టే విష‌యానికి వ‌స్తే ఆమె కీర్తి సురేష్‌తో క‌లిసి బాలీవుడ్‌లో వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే ప‌లు సినిమాలు కూడా చేస్తుంది.ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ వైపే రాధికా ఆప్టే చూడ‌డం లేదు.మంచి సినిమాతో తిరిగి రీఎంట్రీ ఇవ్వాల‌ని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Latest News