T20 World Cup IND Vs Canada | భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు

భారత ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షార్పణమయింది. కెనడాతో జరగాల్సిన నామమాత్రపు మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించగా, భారత్ 7 పాయింట్లతో ఎ1 గా నిలిచి సూపర్–8కు వెళ్లగా, కెనడా 3 పాయింట్లతో ఇంటికి వెళ్లింది.

  • By: Tech    sports    Jun 15, 2024 11:11 PM IST
T20 World Cup IND Vs Canada | భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు

పురుషుల ఐసిసి టి20 ప్రపంచకప్ టోర్నీ(Mens T20 Cricket World Cup 2024) లో నేడు జరగాల్సిన భారత్, కెనడా( India vs Canada) మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది(Match abandoned). ఇది ఇరు జట్లకు ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా, చెరో పాయింట్ కేటాయించారు. ఇంతకుముందే 6 పాయింట్లతో సూపర్–8లోకి ప్రవేశించిన భారత్కు ఈ మ్యాచ్ ఫలితం ఎలాంటి ప్రభావం చూపించదు. కేవలం పాయింట్లు 7కు పెరిగాయంతే. కెనడా కూడా ఒక పాయింట్ సంపాదించి 3 పాయింట్లతో టోర్నీనుండి వైదొలగింది( Canada out of WC).

ఇక భారత్ తన సూపర్–8 (Super-8) సమరాన్ని ఈనెల 20న అఫ్ఘనిస్తాన్(Afghanistan)తో మొదలు పెట్టనుంది. ఇక అన్ని గ్రూపుల లీగ్ మ్యాచ్లు జూన్ 18న ముగియనుండగా, సూపర్–8లో మిగిలిన బెర్తులు ఖరారవుతాయి. ఐసీసీ సీడింగ్(ICC Seeding) ప్రకారం సూపర్–8 బెర్తులు ముందే నిర్ణయింపబడగా, కొన్ని జట్లు సూపర్–8కు అర్హత సాధించకపోవడంతో వాటి స్థానాన్ని అర్హత సాధించిన జట్లు భర్తీ చేస్తాయి. ఇక భారత్ ఆడబోయే సూపర్–8 (గ్రూప్ 1) మ్యాచ్ల షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
జూన్ 20 – అఫ్ఘనిస్తాన్ (సి1)
జూన్ 22 – డి2 (దాదాపు బంగ్లాదేశ్)
జూన్ 24 – ఆస్ట్రేలియా(బి2)

వీటిలో రెండు మ్యాచ్ల్లో గెలిస్తే దాదాపు సెమీస్ బెర్త్ ఖాయమైనట్లే. ఎటూ ఆ రెండు జట్లు అఫ్ఘన్, బంగ్లాలు కాబట్టి భారత్కు ఎదురులేదు. ఒక ఆస్ట్రేలియాతో మ్యాచే కఠినంగా ఉంటుంది. ఒకవేళ గెలిస్తే రెండో ప్రశ్నే తలెత్తదు.