Rajasekhar|తాగి రాఘవేంద్రరావు మీదకి వెళ్లిన రాజశేఖర్.. ఆయనకి అంత కోపం ఎందుకు వచ్చిందంటే..!
Rajasekhar| డాక్టర్ రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన పేరు చెబితే మనకు గుర్తుకువచ్చేవి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలు. రాజశేఖర్ నటుడు కాక ముందే డాక్టర్. సినిమా ఇండస్ట్రీకి రాకముందే ఎమ్.బి.బి ఎస్ చేసి చెన్నైలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత భారతీరాజా

Rajasekhar| డాక్టర్ రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన పేరు చెబితే మనకు గుర్తుకువచ్చేవి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలు. రాజశేఖర్ నటుడు కాక ముందే డాక్టర్. సినిమా ఇండస్ట్రీకి రాకముందే ఎమ్.బి.బి ఎస్ చేసి చెన్నైలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా ‘పుదుమాయ్ పెన్’ చిత్రంతో తెరంగేట్రం చేసారు. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తలంబ్రాలు’ సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్ ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టినట్టు తెలుస్తుంది.
అయితే రాజశేఖర్ గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. రాజశేఖర్ తో `అల్లరి ప్రియుడు` వంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాని తీసి మంచి హిట్ ఇచ్చిన రాఘవేంద్రరావుతో గొడవకు దిగాడట ఈ యాంగ్రీ మెన్. అప్పట్లో వారు ఇద్దరు తిట్టుకోవడమే కాదు, కొట్టుకున్నారనే ప్రచారం జరిగింది. అందరి ముందు రాఘవేంద్రరావుని రాజశేఖర్ కొట్టాడనే ప్రచారం కూడా జరిగింది. దానిపై ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు జీవిత, రాజశేఖర్. మొదట్లో ఈ జంట చెన్నైలో ఉండేవాళ్లు. కొద్ది రోజులకి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అయితే పిల్లలని చూసుకునేందుకు చెల్లిని, తల్లిని హైదరాబాద్‌కి తీసుకొచ్చింది జీవిత. అప్పుడప్పుడు చెల్లిని తన వెంట సినిమా షూటింగ్‌లకు వచ్చేదట.
ఓ సందర్భంలో రాఘవేంద్రరావుని కలిసిందట రాజశేఖర్ మరదలు. ఇక వారిద్దరి మధ్య పరిచయం పెరగడం, ఎవరి ద్వారానో జీవిత చెల్లెలు ఫోన్ నెంబర్ రాఘవేంద్ర రావు కి దొరకడం జరిగిందట. ఇక ఆమెని సినిమాల్లోకి తీసుకురావాలని రాఘవేంద్రరావు భావించాడట. సీరియల్స్, సినిమాలు చేస్తే బాగుంటుందని అన్నాడట. అయితే తరచు రాజశేఖర్ మరదలకి రాఘవేంద్రరావు ఫోన్ చేయడంతో విషయం తెలుసుకున్న రాజశేఖర్ ఆవేశంలో రాఘవేంద్రరావు మీదకు వెళ్లాడట. పెద్ద గొడవ పెట్టుకున్నాడట. తన మరదలితో ఏంటి నీకు పని అంటూ ఫైర్ అయ్యాడట. కొద్ది రోజులకి రాఘవేంద్రరావు తప్పేమీ లేదని, తానే ఆవేశంలో ఎవరో చెప్పిన మాటలు విని ఆయనపైకి వెళ్లానని, తనదే తప్పు అని చెప్పాడు రాజశేఖర్. రాజశేఖర్‌పై ఓ హీరోయిన్‌కి క్రష్ ఉండేదని, కానీ ఎప్పుడూ జీవిత పక్కనే ఉండటంతో తట్టుకోలేక ఇలా చేసిందని రాజశేఖర్ అన్నాడు.