Ram Charan| పిఠాపురంలో బాబాయ్‌తో క‌లిసి సంద‌డి చేసిన అబ్బాయ్… ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

Ram Charan| తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఎన్నిక‌ల ప్ర‌చారానికి కొద్ది స‌మ‌యం మాత్రం ఉండ‌డంతో ప్ర‌ముఖులు అంతా కూడా ప్ర‌చారంలో బిజీగా మారారు. పలువురు సినీ ప్ర‌ముఖులు సైతం ప్ర‌చారంలో పాల్గొంటూ రాజ‌కీయ వాతావ‌ర‌ణం మరింత హీటెక్కిస్తున్నారు. అయితే ఈ సారి పిఠాపురంపైనే అంద‌రి దృష్టి ఉంది. అక్కడ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడంతో ఎవ‌రు గెలుస్తారు అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. అయితే తాజాగా బాబాయ్‌

  • By: sn    cinema    May 11, 2024 3:52 PM IST
Ram Charan| పిఠాపురంలో బాబాయ్‌తో క‌లిసి సంద‌డి చేసిన అబ్బాయ్… ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

Ram Charan| తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఎన్నిక‌ల ప్ర‌చారానికి కొద్ది స‌మ‌యం మాత్రం ఉండ‌డంతో ప్ర‌ముఖులు అంతా కూడా ప్ర‌చారంలో బిజీగా మారారు. పలువురు సినీ ప్ర‌ముఖులు సైతం ప్ర‌చారంలో పాల్గొంటూ రాజ‌కీయ వాతావ‌ర‌ణం మరింత హీటెక్కిస్తున్నారు. అయితే ఈ సారి పిఠాపురంపైనే అంద‌రి దృష్టి ఉంది. అక్కడ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండడంతో ఎవ‌రు గెలుస్తారు అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. అయితే తాజాగా బాబాయ్‌కు మద్దతుగా తన తల్లి సురేఖ కొణిదెలతో కలిసి మెగా పవర్ స్టార్ రాంచరణ్ పిఠాపురానికి చేరుకొన్నారు. ప్రచారం సమయానికి ముగింపు దగ్గరపడుతుండటంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ పిఠాపురంలోని కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొనేందుకు తన తల్లి సురేఖతో శనివారం ప్రత్యేక విమానంలో ఉదయం రాజమండ్రికి చేరుకొన్నారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన పిఠాపురం చేరుకోగా, ఆయ‌న‌కి రాజమండ్రి విమానాశ్రయంలో భారీ స్వాగతం లభించింది. మెగా అభిమానులు పొటేత్తుతూ గోలు చేశారు .కుకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పార్థనలు చేసిన తర్వాత ఆయన తన అభిమానులు, మెగా, పవర్ స్టార్ అభిమానులతో భేటీ అయ్యారు రామ్ చ‌ర‌ణ్‌. అయితే పిఠాపురంలో అడుగుపెట్టగానే పవన్ నివాసానికి వెళ్లి, బాబాయ్ పవన్ ను కలిసి కొద్దిసేపు ముచ్చటించాడు. వీరిద్దరూ కలిసి ప్రజలని ప‌ల‌క‌రించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చాలాకాలం తరువాత బాబాయ్- అబ్బాయ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి అక్క‌డి వారు తెగ సంతోషం వ్య‌క్తం చేశారు.

ఇద్ద‌రు క‌లిసి కాసేపు అభిమానుల‌కి అభివందం చేశారు. చరణ్ భుజాన చెయ్యి వేసి పవన్ అభిమానులకు అభివాదం చేసిన తీరు అక్కట్టుకుంటుంది. పవన్ ఇంటివద్ద జన సందోహం సంద్రంలా మారడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. గ‌త కొన్ని రోజులుగా వ‌రుణ్ తేజ్, సాయి ధ‌ర‌మ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్ వంటి వారు ప‌వ‌న్ కొసం ప్ర‌చారానికి రాగా, ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా ప‌వ‌న్ కోసం రావ‌డం ఆనందం క‌ల‌గ‌జేసింది. మ‌రి కొద్ది నిమిషాల‌లో ప‌వ‌న్, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రు క‌లిసి జ‌న‌సేన కోసం ప్ర‌చారం చేయ‌బోతున్నారు. ఇద్ద‌రిని అలా క‌లిసి చూసిన ఫ్యాన్స్‌కి ఆనందం అంతా ఇంతా ఉండదు